Home /News /telangana /

FAKE DSP ARRESTED WHO IS DOING FRAUD TO EMPLOYEES BY BEGUM BAZAR POLICE VRY

Fake DSP : ఇంటర్మిడియట్‌తోనే డీఎస్పీ... పోలీస్‌ డ్రస్‌లో హల్‌చల్...!

Fake DSP : ఇంటర్మిడియట్‌తోనే డీఎస్పీ... పోలీస్‌ డ్రస్‌లో హల్‌చల్...!

Fake DSP : ఇంటర్మిడియట్‌తోనే డీఎస్పీ... పోలీస్‌ డ్రస్‌లో హల్‌చల్...!

Fake DSP : ఇంటర్ కూడా పాస్ కాలేదు... కానీ ఏకంగా డీఎస్పీ అయ్యాడు.. ఏంచక్కా.. యూనిఫామ్ వేసుకుని పోలీసు ఐడీతో డీఎస్పీగా దర్జాగా చలామణి అవుతూ.., ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. నకిలీ పాస్ బుక్కులు.. సెటిల్మెంట్లు చేస్తున్నాడు..ఇలా సంవత్సరాలుగా మోసం చేస్తున్నా..గురుడు నేటికి పట్టుబడ్డాడు.

ఇంకా చదవండి ...
    కామారెడ్డి జిల్లా బిబి పేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన ఓ నకిలీ డి.ఎస్.పి బాగోతం బట్టబయలైంది.తుజల్ పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి డీఎస్పీ వేషధారణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టార్గెట్ చేసుకొని లక్షల్లో వసూళ్లకు పాల్ప డ్డారు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అంతా మన వల్లే ఉన్నారంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు ఉద్యోగులకు మాయామాటలు చెప్పాడు.

    ఇలా స్వామి తన గ్రామంలో కొందరితో కలిసి ముఠా గా ఏర్పడి కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్ ,మెదక్ జిల్లాలోనూ 20 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నమ్మబలికాడు. ఒక్కొక్కరి నుండి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిస్తోంది..ఇలా అర్ధరాత్రి అయ్యిందంటే చాలు నెల్లూరు స్వామి పది మంది తో కలిసి బీబీపేట , తుజల్ పూర్ బస్టాండ్ల వద్ద వాహనాన్ని నిలుపుకొని పోలీసుల విధులు నిర్వహిస్తూ మరి వసుళ్లకు పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి..

    ఉద్యోగాలతో పాటు తుజల్ పూర్ గ్రామంలో నుండి వెళ్లే...ఇసుక ట్రాక్టర్ల ను, టిప్పర్లు టార్గెట్ చేసుకొని స్వామి వసూళ్లకు పాల్పడేవాడని పోలీసు విచారణలో తేలింది. దీంతో పాటు నకిలీ పాస్ బుక్కులు తయారు చేయించి ఇవ్వడం, గ్రామానికి చెందిన వారికి హౌసింగ్ లోన్స్, పాసుబుక్ లపై లోన్లు ఇప్పించడం వంటి పనులు చేసేవాడు..అయితే.. స్వామి విషయం తెలిసిన పోలీసులు సైతం ఇన్నాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.

    ఇక స్వామికి స్థానికంగా ఉండే ఓ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి,ఆయన బంధువుల అండ ఉండడం వల్ల పలు మోసాలకు అక్రమాలకు పాల్పడటం జరిగిందని స్థానికులు చెబుతున్నారు...ఇలా ఎవరి అడ్డు లేకపోవడంతో సంవత్సర కాలంగా స్వామి డీఎస్పీగా కొనసాగాడు. అయితే ఇటివలే.. స్వామి పై అనుమానం వచ్చిన కొందరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో,వారు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.

    దీంతో విచారణలో అతను పోలిస్ కాదని తేలింది.. స్వామిని పట్టుకునేందుకు హైదరాబాద్ లోని బేగం బజార్ నుండి పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు మూడు రోజులుగా బిబీ పేట మండలంలో మకాం వేశారు. కామారెడ్డి పోలీసుల సహకారంతో ఈ నెల 14 బుధవారం రాత్రి స్వామిని అతని ఇంటి వద్దనే అదుపులోకి తీసుకున్నారు...ఇంటర్మీడియేట్ పాస్ కానీ వ్యక్తి డీఎస్పీగా ఇన్నిరోజులు చలామణి అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని , స్థానిక పోలీసులు కూడా అతనితో పార్టీలకు వెళ్లడం తో పలు అనుమానాలకు దారితీస్తుంది...
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Fake id, Kamareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు