news18-telugu
Updated: February 24, 2020, 10:25 AM IST
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు... పోలీసులు అలర్ట్...
Indian Railways : సికింద్రాబాద్రైల్వేస్టేషన్లో బాంబు ఉందని ఓ దుండగుడు గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు కాల్ చేసి చెప్పాడు. ఆదివారం అర్ధరాత్రి 12.30కి ఆ బాంబు పేలుతుందని తెలిపాడు. ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్స్య్వాడ్తో రైల్వేస్టేషన్‌కి వెళ్లి... స్టేషన్ మొత్తాన్నీ పరిశీలించారు. రాత్రంతా నిద్రపోకుండా అన్నీ చెక్ చేశారు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడినప్పటికీ... తమ క్షేమం కోసమే అధికారులు ఇలా చేస్తున్నారని గుర్తించి... పోలీసులకు బాగా సహకరించారు. ఐతే... ఎక్కడా ఏ బాంబూ కనిపించలేదు. ఎందుకైనా మంచిదని మరోసారి కొన్ని కొన్ని ప్రదేశాల్లో చెక్ చేశారు. అప్పటికీ బాంబేదీ కనిపించలేదు. ప్రయాణికులు కూడా తమ తమ లగేజీల్లో ఎవరైనా బాంబు పెట్టేశారేమో అని బాగా చెక్ చేసుకున్నారు. రైళ్లు ఎక్కేవాళ్లు, దిగేవాళ్లు కూడా చెక్ చేసుకున్నారు. అంతా బాగానే ఉండటంతో, ఎక్కడా ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ రాకపోవడంతో... ఏ బాంబూ లేదనీ, అది బాంబు బూచి కాల్ అనీ నిర్ధారించుకొని హమ్మయ్య అనుకున్నారు.
ఐతే... పోలీసుల తనిఖీల వల్ల చాలా మంది ప్రయాణికులు కంగారు పడ్డారు. ఏం జరిగింది, ఎందుకు చెక్ చేస్తున్నారని అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు. బాంబు ఉందని కాల్ వచ్చిందంట అని తెలుసుకొని... ఒకింత కంగారు పడ్డారు. తాము ఉన్న ప్రదేశంలో బాంబు ఉందేమో అని చుట్టూ చూసుకున్నారు. ఇలా ఆ ఒకక కాల్... లేనిపోని కంగారు పుట్టించింది. అసలు ఆ కాల్ ఎవరు చేశారో తెలుసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు ఎందుకైనా మంచిదని... సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో సెక్యూరిటీని మరింత పెంచారు.
Published by:
Krishna Kumar N
First published:
February 24, 2020, 9:59 AM IST