హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad : ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ బురిడి.. ఆ తర్వత ముఠా ఏం చేసిందంటే...?

Adilabad : ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ బురిడి.. ఆ తర్వత ముఠా ఏం చేసిందంటే...?

Adilabad : ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ కుటుంబాలను మాయలో పడేసి వారి నుండి లక్షల రూపాయలను దోచుకుంటున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాయమాటలతో ఆ ముఠా 18 లక్షల రూపాయలను కాజేసింది.

  మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని ఓ కుటుంబాన్ని నమ్మించిన ఓ దొంగబాబా ..కుటుంబ సభ్యుల నుండి 18 లక్షల మూడు వేల రూపాయలు కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర కు చెందిన   చౌహన్ ప్రకాష్, పంజాబ్ రావ్, బాబర్ భిక్కాజి అనే ముగ్గురు వ్యక్తులు బాబాలుగా అవతారమెత్తారు.  గ్రామాల్లో తిరుగుతూ ఇంట్లో గుప్తనిధులున్నాయంటూ నమ్మబలికి, ఆశ కలిగించి, ఆ తర్వాత వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి అమాయకత్వంను ఆసరాగా చేసుకుని వారి వద్ద నుండి డబ్బులు కాజేస్తున్నారు. ఈ క్రమంలో వాంకిడి మండలం ఘాట్ జనగాం గ్రామానికి చెందిన చటారి కమలాకర్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి, వారిని నమ్మించి, కుటుంబసభ్యుల ప్రాణానికి  హాని ఉందని, డబ్బులు ఇస్తే మందు ఇస్తామని, పూజలు చేస్తామని లేదంటే ప్రాణం పోతుందని నమ్మబలికి విడతల వారిగా వారి వద్ద నుండి మొత్తం 18లక్షల 3వేల రూపాయలు  కాజేశారు.

  అంతటితో ఆగకుండా మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితులు వాంకిడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మళ్లీ ఆ దొంగబాబాలు  గ్రామానికి వస్తున్న సమయంలో  వాంకిడి సిఐ సుధాకర్, ఎస్.ఐ దీకొండ రమేష్ పోలీస్ సిబ్బందితో కలిసి ఇందాని క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు.  వారిని విచారించి కాజేసిన సొమ్ము 18 లక్షల మూడు వేల రూపాయలను రికవరీ చేశారు. నిందితులతోపాటు గుప్త నిధులు తవ్వెందుకు ఉపయోగించిన సామగ్రితో పాటు, మోసం చేసేందుకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనపర్చుకుని మీడియా ముందు ఉంచారు.

  Karimnagar : కరీంనగర్ – వరంగల్ 4 లేన్ విస్తరణకు రూ.2146.86 కోట్లు విడుదల, మంత్రి ట్వీట్

  ప్రజలు అత్యాశతో గుప్త నిధుల వంటి వాటి జోలికి వెళ్ళవద్దని అన్నారు. అలాంటివి ఉంటే పోలీసులకు సమాచారమివ్వాలని పోలీసులు సూచించారు.   మంత్రాలు, తంత్రాలు వంటివి ఉండవని, అలాంటి వాటిని నమ్మవద్దని జిల్లా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి అచ్చేశ్వర్ రావ్, డి.ఎస్.పి శ్రీనివాస్, సిఐ సుధాకర్, ఎస్.ఐ దీకొండ రమేష్ పాల్గొన్నారు

  .

  First published:

  Tags: Adilabad, Telangana Police

  ఉత్తమ కథలు