• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • FACT CHECK VIDEO IN SOCIAL MEDIA CIRCULATION DOES NOT PERTAIN TO BALANAGAR FLYOVER SITE IN HYDERABAD SK

Fact Check: హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కుప్పకూలిందా? ఆ వైరల్ వీడియో నిజమేనా?

Fact Check: హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కుప్పకూలిందా? ఆ వైరల్ వీడియో నిజమేనా?

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కుప్పకూలిందా? ఆ వైరల్ వీడియో నిజమేనా?

ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దాని శిథిలాల కింద పదుల సంఖ్యలో వాహనాలు చిక్కుకున్నాయని.. అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారని ఓ వీడియో విపరీతంగా సర్కులేట్ అవుతోంది

  • Share this:
    హైదరాబాద్‌లో భారీ ప్రమాదం జరిగిందని ఓ వార్త వాట్సప్‌తో పాటు ఇతర సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. బాలానగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలిందని ప్రచారం జరుగుతోంది. ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దాని శిథిలాల కింద పదుల సంఖ్యలో వాహనాలు చిక్కుకున్నాయని.. అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారని ఓ వీడియో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఈ వీడియోను చాలా మంది వాట్సప్‌లో షేర్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు బాలానగర్, జీడిమెట్ల వైపు వెళ్ల కూడదని కొందరు సూచిస్తున్నారు. ఐతే ఈ వీడియోపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఎలాంటి ఫ్లై ఓవర్ కుప్పకూలలేదని వెల్లడించారు. ఇది ఫేక్ న్యూస్ అని... ప్రజలెవరూ నమ్మకూడదని సూచించారు.


    మరి ఆ వీడియో ఎక్కడిది?
    సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం.. హైదరాబాద్ కాదు హర్యానా. గత ఏడాది ఆగస్టు 24న రాత్రి గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్డులో నిర్మాణంలో ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు ప్లైఓవర్ కింద నలిగిపోయాయి. ఐతే రాత్రి వేళ కావడం, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండడంతో.. తక్కువ సంఖ్యలో మాత్రమే వాహనాలు అటుగా వెళ్లాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్థానికులు, రెస్క్యూ సిబ్బంది కాపాడి ఆస్పత్రికి తరలించారు. 2020 ఆగస్టులో గురుగ్రామ్‌లో జరిగిన ఘటనను హైదరాబాద్‌లో జరిగినట్లుగా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.

    ఫేస్‌బుక్, ట్విటర్ ఓపెన్ చేస్తే చాలు.. ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి. వేలాది వార్తలు దర్శనమిస్తాయి. ఇవి చాలదన్నట్లు వాట్సప్‌కు కుప్పలు తెప్పలుగా వార్తలు సందేశాల రూపంలో వస్తున్నాయి. మరి అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. సోషల్ కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్ముతున్నారు. అందుకే వాట్సాప్‌లో వచ్చే ప్రతి వార్తనూ నమ్మవద్దు. ఇతర మీడియా విభాగాల్లో చెక్ చేసిన తర్వాతే ధృవీకరించుకోవాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు