అనాథ యువతికి అండగా.. అన్నీ తామై పెళ్లి చేసిన ఫేస్ బుక్, వాట్సాప్ ఫ్రెండ్స్

ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను సేవ చేసేందుకు ఉపయోగించి ఆదర్శంగా నిలిచారు ఈ యువకులు. అనాథ యువతికి అండగా నిలిచి అన్నీ తామై పెళ్లి చేశారు ఆ ఫేస్ బుక్, వాట్సాప్ మిత్రులు.

news18-telugu
Updated: November 2, 2020, 5:32 PM IST
అనాథ యువతికి అండగా.. అన్నీ తామై పెళ్లి చేసిన ఫేస్ బుక్, వాట్సాప్ ఫ్రెండ్స్
నూతన దంపతులు
  • Share this:
ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను సేవ చేసేందుకు సైతం ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలిచారు ఈ యువకులు. అనాథ యువతికి అండగా నిలిచి
అన్నీ తామై పెళ్లి చేశారు ఆ ఫేస్ బుక్, వాట్సాప్ మిత్రులు. వివరాల ప్రకారం.. ఆమె పేరు అవునూరి ప్రభ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని అత్యంత నిరుపేద కుటంబంలో జన్మించింది. రెక్కడితేగాని డొక్కానిండని కడు పేదరికం. తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కాలం కన్నెర్ర చేసింది. పదేళ్ల కిందట అనారోగ్యంతో తల్లిదండ్రులు ఒకరి తర్వాత మరొకరు ఆకాల మరణం చెందారు. దీంతో ప్రభ దిక్కులేనిదైంది. అప్పటి నుంచి తన తమ్ముడితో కలిసి ఒంటరిగా జీవిస్తూ ఓ వైపు కుటుంబ భారాన్ని మోస్తూ.. మరోవైపు దాతల సాయంతో ఇంటర్ విద్య పూర్తి చేసింది. ఈ క్రమంలోనే పెళ్లి వయస్సు వచ్చేసింది. దీంతో మరోసారి దాతల సాయం అవసరమయింది.

ఈ నేపథ్యంలో దాతలు దాతలు, ప్రముఖులు కదిలి వచ్చారు. ఈ క్రమంలో ప్రభ ధీన స్థితిపై గ్రామ సర్పంచ్ జంకె విజయ-శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ప్రభ జీవితంలో కొత్త వెలుగులు నింపేందుకు కలం అక్షర సత్యం టీం సభ్యులు కృషి చేశారు. నెల రోజుల క్రితం ప్రభ దీన స్థితిపై కలం అక్షర సత్యం పేరిట యువతి స్థితిగతులను, పెళ్లి విషయంపై ఫేస్ బుక్ లో వాట్సాప్ లో పోస్టు పెట్టి ప్రచారం చేశారు. దీనికి స్పందించిన చాలా మంది దాతలు ఆర్థిక సాయం అందించారు. ఇక ఈ పోస్టుకు స్పందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖర్చులను పూర్తిగా భరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు పెళ్లికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కూడా సహాయం అందిస్తామన్నారు .

వీరితో పాటు చాలా మంది ప్రముఖులు ప్రభ పెళ్లికి కావాల్సిన ఖర్చులు, ఇతరత్రా సామగ్రిని అందించనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రభ పెళ్లికి జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ తో పాటు ఎస్సీ కలిసి ఆహ్వన పత్రికలను కూడా అందజేశారు. వారుకూడా తమకు తోచిన సహాయం అందిస్తామన్నారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల వారు రూ.5వేల ఆర్థిక సాయం అందించేలా కృషి చేశారు. వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖ ఎన్నారై వివాహనికి తరలివచ్చే వారికి పెట్టే భోజన ఖర్చులు బరిస్తామన్నారు.

తోట రాం కుమార్ టీఆర్కే ట్రస్ట్ వారు ప్రభకు నిత్యావసర సరుకులు అందించడమే కాకుండా యువతి ఇంటి వద్ద మరుగుదొడ్లు నిర్మించారు. చాలా మంది యువకులు, దాతలు తమకు తోచిన విధంగా సాయం చేశారు. కన్నీళ్లను దిగమింగుతూ జీవనం సాగిస్తున్న ప్రభకు ఫేస్ బుక్, వాట్సాప్ మిత్రులు అండగా నిలిచి ఆశీర్వాదించారు. తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన గ్రామ పెద్దలకు, జిల్లా sp కి, ఫేస్బుక్, వాట్సాప్ మిత్రులకు ప్రభ కృతజ్ఞతలు తెలిపింది. చందుర్తి మండలం రామన్నపేటకు చెందిన యువకుడు ముందుకు వచ్చి యువతి కష్టసుఖాల్లో పాలుపంచుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రభను పెళ్లి చేసుకొని ఆమె కొత్త జీవితంలో భాగస్వామ్యమయ్యాడు.
Published by: Nikhil Kumar S
First published: November 2, 2020, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading