Home /News /telangana /

FACE BOOK FRIENDS HELP TO GET MARRIAGE WHO IS POOR AT SIRICILLA VRY KNR

Karimnagar : ఆడపిల్ల పెళ్లి కోసం... ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్ చేయూత.. కట్నాలు, కానుకలతో ఘనంగా పెళ్లి...!

face book

face book

Karimanagar : ఫేస్‌బుక్ గ్రూప్‌ సభ్యులు ఓ పేదింటి అమ్మాయి పెళ్లిని అన్ని తామై చేశారు.. కట్నకానులతో పాటు మిగిలిన తంతు కోసం కావాల్సిన ఆర్ధిక ఆవసరాల కోసం గ్రూపు సభ్యులు ముందుకు వచ్చారు.. దీంతో ఎలాంటీ చింతా లేకుండా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ సహాకారంతో వివాహం జరిగింది.

ఇంకా చదవండి ...
  ఫేస్‌బుక్ (face book ) గ్రూప్‌ ఫ్రెండ్స్( friends) అంటే కేవలం వ్యక్తిగత అంశాలను షేర్ చేయడం కాదు.. ఆ గ్రూపులో సభ్యుల కష్టాల్లో కూడా పాలు పంచుకునే గ్రూపులు కూడా ఉన్నాయి.. ఇటివల పెరిగిన సోషల్ మీడియా ప్రభావంతో యువతతోపాటు అనేక మంది సోషల్ మీడియాలో తమవంతు పాత్రను పోషిస్తున్నారు.. మనిషి నేరుగా తెలియకున్నా .. ఆ మనిషి కష్టాన్ని సామాజిక మాద్యమాల (socialmedia) ద్వారా తెలుసుకుని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా దేశంలో ఎక్కడ ఏం జరిగినా మేమున్నామంటూ ఎంతోమంది దాతలు సోషల్ మీడియా ద్వారా ముందుకు రావడంతో అమ్మాయి పెళ్లి జరిగింది.

  వివరాల్లోకి వెళ్తే.... రాజన్న సిరిసిల్లా (siricilla) జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు లక్ష్మన్ - లక్ష్మీ అనే నిరుపేద దంపతులకు కూతురు రజిత వివాహం నిశ్చయం అయింది. కాని ఆర్థిక స్థోమత లేక కూతురు వివాహం ఎలా జరిపించాలో తెలియక స్థానిక వార్డు సభ్యుడు చెప్యాల గణేష్ అనే వ్యక్తిని కలిసి రజిత వివాహం, ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు.

  బిచ్చగత్తె... దానకర్తగా మారింది. కారణం తెలిస్తే.. షాకే మరి..!


  ఈ విషయం తెలుసుకున్న గణేష్ సామాజిక సేవలు చేస్తున్న 'నా కలం అక్షర సత్యం ఫేస్ బుక్ పేజీ అడ్మిన్ కు విషయం చెప్పాడు..ఈ క్రమంలోనే అడ్మిన్ స్పందించి విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.., ఆ తర్వాత తన టీం సభ్యులతో వివాహానికి సంబంధించి చర్చించాడు... ఈ క్రమంలోనే వివాహ ఖర్చులకు సంబంధించి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాడు.

   ఇది చదవండి : భర్త ఇంటికి రాడని పక్కింటి కుర్రాడిని రమ్మంది....! ఇద్దరు ఒకే గదిలో ఉండగా అత్త గొళ్లెం పెట్టింది అంతే...!


  దీంతో ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ద్వారా దాతలు ముందుకు వచ్చి రజిత వివాహానికి అండగా నిలిచారు. తమ స్థోమత మేరకు పలువురు గ్రూపు సభ్యులు సహాయం చేశారు. పెళ్లి కోసం కావల్సిన చీర, సారే, వంట సామాను, కూలర్, బీరువాతోపాటు , పుస్తే మట్టేలతో సహ పెళ్లికి(marriage) కావాల్సిన తల్లిగారు పెట్టే వస్తువులను అదజేసి గత శుక్రవారం రజిత వివాహం వరుని ఇంటిలో ఘనంగా జరిపించారు.

  ఇది చదవండి : చెల్లెలికి అన్న గ్రేట్ గిఫ్టు.. హెల్త్ ఇన్సూరెన్స్ ‌, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ ఎందుకో తెలుసా... ?


  అనంతరం ఆదివారం వధువు ఇంటిలో రిషెప్సన్ ఏర్పాటు చేయడంతో.. నా కలం అక్షర సత్యం ఫేస్‌బుక్ గ్రూప్ సభ్యుల అభ్యర్థన మేరకు స్థానిక సర్పంచ్ తోపాటు స్థానికులు కొంతమంది పెళ్ళి భోజనాల ఖర్చు, తోపాటు తలా ఓ చెయి వేసి రజిత వివాహాం ఘనంగా జరిపించారు. అనంతర కొద్దిమంది విరాళాలు కూడా ఇచ్చారు..ఇలా విరాళాలతో వచ్చిన డబ్బుల్లో మొత్తం ఖర్చులు పోను ఒక లక్షా డెబ్బై ఒక్క వేల రూపాయలు కూడా మిగిలాయి.. ఆ మిగిలిన డబ్బులను పెళ్లి కూతురు రజిత తల్లిదండ్రులైన సింగారపు లక్ష్మన్, లక్ష్మీ దంపతులకు వివాహ అనంతరం అందజేశారు.

  ఈ క్రమంలోనే ఈ పెళ్లి వేడుక వైరల్ గా మారింది.. ఫేస్ బుక్ గ్రూపుల ద్వార వచ్చిన డబ్బులతో పెళ్లి సైతం నిర్వహించడంతో.. స్థానికంగా పెళ్లి వేడుకపై అందరి అందరి దృష్టి పడింది. దీంతో పెళ్లికి అన్ని తామై నడిపించిన ఫేస్ బుక్ సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Facebook friend, Karimnagar, Siricilla

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు