సైబర్ నేరాలపై పోలీసులు అప్రమత్తం చేస్తున్నా...నగరానికి చెందిన యువతి యువకులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యంగా గిఫ్టులు, డబ్బులు ఆత్యాశ చూపడంతో నగరవాసులకు గాలం వేస్తున్నారు. దీంతో అధిక డబ్బు ఆశ చూపి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ముందుగా వేల రూపాయలు ఇచ్చి ఆ తర్వాత అసలు మోసానికి తెరలేపుతున్నారు. కాగా ఇలా సైబర్ వలలో పడి మోసపోతున్న వారిలో ఎక్కువగా ఉన్నత చదువులు ఉద్యోగాలు చేస్తున్నవారే ఉండడం విశేషం. ఇలా సైబర్ నేరాలు నగరంలో పెరుగుతుండడంతో ఏకంగా ప్రతి స్టేషన్లో సైబర్ సెల్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వందల కేసులు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువకుడి ఫేస్బుక్ ఖాతాకు ఓ అందమైన అమ్మాయి ఫొటోతో ఉన్న ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ యువకుడు రిక్వస్ట్‌ను అంగీకరించాడు. తాను ఏపీలోని గుంటూరులో ఉంటానని, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానంటూ ఆమె వివరాలను చెప్పింది.ఇలా.. ఒకరినొకరు చూసుకోకుండానే స్నేహం మొదలైంది. అదికాస్తా.. ప్రేమగా మారింది.ఈ క్రమంలో తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమంటూ యువతి అడుగుతుండటంతో ఆ అబ్బాయి విడతల వారీగా ఆమెకు రూ.95 లక్షలు పంపాడు...
ఇది చదవండి : మిస్టరీ వీడింది.. దారుణం వెలుగు చూసింది.. బిక్షాటన.. అక్రమ సంబంధమే కారణం..
ఇలా కొద్ది రోజుల పాటు చాటింగ్ చేసిన ఆ తర్వాత ఆ అమ్మాయి ఫేస్బుక్ ఖాతా డిలీట్ అయింది. ఇక ఫోన్లోనూ అందుబాటులో లేకుండా పోయింది. దాంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా కొద్ది రోజుల క్రితమే.. ఓ వ్యక్తి నుండి అధిక ఆదాయం పేరుతో మోసం చేసి 65 లక్షల రూపాయలను కాజేశారు. పదివేలు పెట్టుపడితే.. లక్షల రూపాయలు ఇస్తామంటూ నమ్మబలికారు.. ముందుగా చెప్పిన ప్రకారం డబ్బులు ఇస్తూ పెద్ద మొత్తంలో దోచుకున్న తర్వాత దుకాణం ఎత్తేశారు. అయితే సైబర్ నేరాలపై పోలీసులు అప్రమత్తం చేస్తున్నా.. సైబర్ వలలో చిక్కుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగడం ఆందోళన కల్గిస్తున్న అంశం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారిపై సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. దీంతో అందమైన చాటింగ్‌లు, ప్రేమ పేరుతో మోసాలు పెరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Hyderbad