Home /News /telangana /

FACE BOOK BABA FRAUD A LADY DOCTOR AT HYDERBAD TO PASS THE EXAMS WITH POOJA

Hyderabad : ఫేస్‌బుక్ పూజారి చేతిలో మోసపోయిన "సగం డాక్టర్" కారణం ఇదే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : వైద్య విద్య పూర్తి చేసిన ఓ మహిళ.. తన వృత్తికే విరుద్దంగా వ్యవహరించింది.. చదివి విజ్ఝానం పొందాల్సిన ఆమె .. పూజలు, పునస్కారలంటూ ఓ మాటల మాత్రికుడి భారిన పడింది. అంతే... సుమారు లక్ష రూపాయాలు కోల్పోయి.. చివరకు పోలీసులను ఆశ్రయించింది.

ఇంకా చదవండి ...
  చదివింది ఎంబీబీఎస్ (mbbs)అది కూడా విదేశాల్లో.. కాని రోగులకు చికిత్స్ అందించాలంటే మరో పరీక్ష (Exams)పాస్ అయ్యోందుకు ఆమెకు కష్టంగా మారింది. రెండు సార్లు పరీక్షకు హజరైనా ఆమె ఎంతకు పాస్‌ కాకపోవడంతో .. మరో మార్గాన్ని ఎంచుకుంది. అయితే ఏ మాస్ కాపియింగ్ మరో లాబియింగ్ కూడా కాదు.. ప్రజలకు వైద్యం చేసి దేవుడిగా మారాల్సిన ఆమె ఏకంగా దేవుడు, పూజలు అంటూ పక్కదారి పట్టింది. ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్ష పాస్‌ అయ్యోందుకు పూజలపై ఆధారపడింది.

  వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు (west bengal) చెందిన ఓ మహిళ ప్రస్తుతం కొండాపూర్‌లో ఉంటుంది. అయితే ఆమె విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. కాని ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే మరో ఎఫ్ఎంజీఈ(FMGE) పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. దీంతో ఆ పరీక్ష కోసం పలుసార్లు హజరైనా పాస్ కాలేకపోయింది. దీంతో ఎలా పాస్ కావాలనే ఆలోచనతో ఆమె ఉంది.

  ఇది చదవండి : సీఎం కేసిఆర్ కుటుంబంలో వివాదాలు... త్వరలో బయటపడతాయి... !


  ఇలాంటి సమయంలో ఆమె సోదరి ఫేస్‌బుక్‌కు (face book) బిస్వజీత్ ఝా అనే పూజారి నుండి ఓ మెసెజ్ వచ్చింది. కొన్ని రకాల పూజలు చేస్తే ఎలాంటీ ఇబ్బంది లేకుండా పరీక్షలు పాస్ కావచ్చని దాని సారంశం. దీంతో వెంటనే ఆ స్వామిజి కాంటాక్ట్ వెతికి రిప్లై పెట్టింది. తన సోదరి పడుతున్న అవేదనను పూజరీకి తెలియజేసింది.

  ఇంకేముంది.. పూజారి మాయలో పడిన యువతికి ప్రత్యేకమైన పూజలు పూజలు చేయాలంటూ చెప్పాడు. అందుకోసం తన హాల్ టికెట్ ‌ను వాట్సప్ ద్వారా పంపింది. ఇందుకోసం ఓ ఇరవై వేల రూపాయలు కూడా సమర్పించింది. అయితే ఆమె అనుకున్నట్టుగా ఈ సారి పాస్ కాలేదు. దీంతో మరోసారి స్వామిజీని ఆశ్రయించింది.

  ఇది చదవండి : ఆ మాజీ మంత్రి పైనే అందరి గురి.. .. ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకు వ్యుహాలు..


  అయితే ఈ సారి ఏదో లోపం జరిగి ఉంటుందని నమ్మించాడు. రెండో సారి మరోపూజ పేరు చేప్పాడు. చదివి పాస్ కావల్సిన సగం డాక్టర్.. పూజల ద్వారానే లాభం పొందాలనే మరోసారి స్వామిజీని నమ్మెలా చేసింది. ఇందుకోసం మరో 50 వేల రూపాయలు కూడా సమర్పించుకుంది. అయినా అదే పరస్థితి.. చదివి రాయగల్గితేనే కావాల్సిన పరీక్ష .. ఎదో చేస్తే ఎందుకు పాస్ అవుతారనే కనీస అవగాహన లేని సగం డాక్టర్.. పరీక్షలో మరోసారి ఫెయిల్ (Fail)అయింది.

  స్వామీజి వద్ద మోసపోయానని గ్రహించిన సగం డాక్టర్ .. చాలా రోజులకు తేరుకుంది. పూజారీ తనను మోసం చేశాడని బజారుకెక్కింది. తనకు న్యాయం చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఆ స్వామిజి చెరలో చాలా మందే చిక్కినట్టు తెలుస్తోంది.పదుల సంఖ్యలో ఇలాంటి విద్యావంతులు స్వామిజి భారిన పడినట్టు సమాచారం. ఇక మహిళ కేసుతో రంగంలోకి దిగిన పోలీసులు స్వామిజీని వెతికి పట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Facebook, Hyderbad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు