తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల కోసం ఆధ్యాత్మిక భవనాలు నిర్మించడంలో కృషి కృషి చేస్తోందని అన్నారు. గణేష్ భవన్ వేగంగా నిర్మితమయ్యేందుకు కారణమైన అధికారులు, ఇంజనీర్లు, మేస్త్రిని మంత్రి అభినందించారు. వినాయక చవితి సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లోనూ గణేష్ భవన్ ను సద్వినియోగం చేసుకోవాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.
మహబూబ్ నగర్ పట్టణం లోని ఆర్డీఓ ఆఫీస్ సమీపంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్ ను ప్రారంభించి అనంతరం గణేష్ భవన్ లో ప్రతిష్టించిన గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. pic.twitter.com/sHzwlSkANZ
— V Srinivas Goud (@VSrinivasGoud) August 31, 2022
మంత్రితో పాటు మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బుచ్చారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, ముడా డైరెక్టర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను (Ganesh Chaturthi 2022) ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మరో కార్యక్రమంలో చెప్పారు. దారి పొడవునా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో లైట్లను ఏర్పాటు చేయడం, క్రిందకు ఉన్న విద్యుత్ తీగలను తొలగించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందు జాగ్రత్త లు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. లక్షలాదిమంది రానున్నందున వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి త్రాగునీటిని అందుబాటులో ఉంచుతారని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రౌండ్ ది క్లాక్ పద్దతి లో GHMC పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.