హోమ్ /వార్తలు /telangana /

TS Politics : హోరెత్తనున్న హుజూరాబాద్.. నిరుద్యోగులే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాల వ్యుహాలు

TS Politics : హోరెత్తనున్న హుజూరాబాద్.. నిరుద్యోగులే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాల వ్యుహాలు

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Politics : ఉప ఎన్నికల సమయంలో పాదయాత్రలు, పార్టీ మీటింగ్‌లతో హుజూరాబాద్ హోరెత్తనుంది. అధికార టీఆర్ఎస్ దసరా తర్వాత భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలు సైతం పాదయాత్రలు ,బహిరంగ సభలకు సన్నద్దమవుతున్నాయి.

హుజూరాబాద్ ఉప ( huzurabad by elections ) ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సమరంలో బీజేపీ, టీఆర్ఎస్ (Trs, BJP) పార్టీలు హోరాహోరి తలపడుతుంటే.. మరోవైపు ఇతర పార్టీలు సైతం ఉప ఎన్నికలపై ప్రభావం చూపెట్టెందుకు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్‌టీపి పాదయాత్ర చేసేందుకు సిద్దమైంది.

ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌టీపీలో (ysrtp) తెలంగాణ పార్టీలో కీలక పరిణామాలు  చోటుచేసుకుంటున్నాయి. పార్టీని మరింత విస్తరించడం, భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల దృష్టి సారించారు. లోటస్‌పాండ్‌లోని నివాసంలో షర్మిలను ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బృందం కలిసింది. అక్టోబరు 20 నుంచి షర్మిల చేపట్టబోయే పాదయాత్ర రూట్ మ్యాప్‌, భవిష్యత్‌ కార్యాచరణపై బృంద సభ్యులు చర్చించినట్టు తెలుస్తోంది. అక్టోబరు 3న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోని కోస్గిలో బీసీ గౌరవ సభ నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ముఖ్యనేతలు ప్రకటించారు.

ఇది చదవండి : హుజూరాబాద్‌పై ప్రత్యేక వ్యూహం.. రెండు రోజుల్లో కాంగ్రేస్ అభ్యర్థి..

ఇక హుజూరాబాద్‌లో నేరుగా ఉప ఎన్నికలో నిరుద్యోగుల తరఫున నామినేషన్లు వేయాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఆపార్టీ కసరత్తు చేస్తోంది. గత కొన్నాళ్లు సీఎం కేసీఆర్‌పై నేరుగా విరుచుకుపడుతున్న షర్మిల తన గళాన్ని మరింత పెంచనున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి కొంతకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( bandi sanjay) సైతం పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమర్శలు చేస్తుండడతో అధికార టీఆర్ఎస్ సైతం ఇదే స్థాయిలో విరుచుకుపడుతుంది. అక్టోబర్ 2న భారీ బహిరంగ సభకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే పక్కనే ఇతర ప్రాంతాల్లో బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇది చదవండి : సుఖీభవ.. సుఖీభవ లాంటీ మరో మీమ్ .. హరన్‌పై పోలీసుల ఫన్నీ ట్వీట్

ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకు దసరా తర్వాత ఎన్నికలకు వారం రోజుల ముందు సీఎం కేసీఆర్ (cm kcr ) భారీ బహిరంగ సభకు స్కెచ్ వేస్తున్నారు.ఇప్పటికే ముగ్గురు మంత్రులు నియోజకవర్గంలో ఉండగా అందుకు అనుగుణంగానే మూడు నుండి నాలుగు బహిరంగ సభలను నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇందుకోసం స్కెచ్ వేశారు. నిరుద్యోగుల ఓట్లను చీల్చేందుకు పక్కా ప్లాన్ వేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నిరుద్యోగులను కూడగట్టేందుకు ఆ పార్టీ సన్నాహలు చేస్తోంది. దీంతో ఆక్టొబరు 2 నుండి 9 వరకు వారికి సంఘీభావంగా పలు కార్యాక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో రానున్న నెల రోజులు హుజూరాబాద్ చుట్టు రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి..

First published:

Tags: Huzurabad By-election 2021, Telangana Politics