హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : కోటలో గుప్తనిధులు అమవాస్య చీకటిలో తవ్వకాలు.. హరితహారం పేరుతో..జిమ్మిక్కులు..!

Karimnagar : కోటలో గుప్తనిధులు అమవాస్య చీకటిలో తవ్వకాలు.. హరితహారం పేరుతో..జిమ్మిక్కులు..!

Karimnagar

Karimnagar

Karimnagar : పల్లె పకృతి పేరిట ఏలగందుల కోటలో గుప్తనిధుల తవ్వకాలు..కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామం లో గుప్తనిధుల కలకలం గుప్పుమంటోంది . వారం రోజులుగా ఈ అంశం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

కరీంనగర్ జిల్లా. న్యూస్18 తెలుగు కారస్పాండెంట్.శ్రీనివాస్. పి

హరితహారంలో భాగంగా ఎలగందుల లోని పదెకరాల స్థలంలో మెగా పల్లె ప్రకృతి వనం పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు . అయితే పిచ్చి మొక్కలు , ముళ్ల పొదలతో ఉన్న ఆ భూమిని చదును చేసి మొక్కలు నాటేందుకు వీలుగా సిద్ధం చేసే పనులకు శ్రీకారంచుట్టారు . గ్రామానికి చెందిన రెండు జేసీబీలతో ముళ్ల పొదలు తొలగించే పనులు చేపట్టారు . ఈ పనులను అదునుగా చేసుకున్న ఇద్దరు గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు , ఒక గ్రామ పంచాయతీ సిబ్బంది , గ్రామానికి చెందిన మరొకరు కలిసి గుప్తనిధుల తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం .

ఎలగందులలోని అతిపురాతన హనుమాన్ ఆలయం వెనుక ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు కన్పిస్తున్నాయి . ఈనెల 8 న అమావాస్య కావడంతో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు చేపట్టి పూజలు సైతం చేసినట్లు గ్రామంలో జోరుగా చర్చ జరుగుతోంది . తవ్వకాల్లో బయటపడ్డ విలువైన నిధులను గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి తరలించినట్లు ఆ నోటా ఈ నోటా గ్రామమంతా పాకి చుట్టు పక్కల గ్రామాల్లో చర్చకు దారితీస్తోంది . ఎలగందులలో ఒకప్పుడు ధనవంతులుగా చలామణి అయిన నిజం ప్రభువులు, కర్నాల కుటుంబీకులు వెండి , బంగారం , వజ్ర , వైడ్యూరాల వంటి విలువైన ఆభరణాలను భూమిలో పాతి పెట్టారనే అనుమానం తో అనేకసార్లు తవ్వకాలు చేపట్టారు .

అప్పట్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారగా కొన్నేళ్లుగా మళ్లీ తవ్వకాలు చేపట్టేందుకు ఎవ్వరు సాహసించలేదు . అయితే ప్రస్తుతం మెగా పల్లె ప్రకృతి వనం పేరిట చేపట్టిన పనులను ఆసరగా తీసుకొని మళ్లీ తవ్వ కాలకు తెరలేపినట్లు చర్చ జరుగుతోంది . గుప్త నిధు

లను గుర్తించేందుకు బాంబ్ మెటల్ డిటెక్టర్ వంటి అధునాతన స్కానరు సైతం ఉపయోగించినట్లు సమాచారం . తవ్వకాలు చేపట్టిన ప్రాంతంలో గ్రామ స్తులకు అనుమానం రాకుండా గుంతను పూడ్చి సర్కారు తుమ్మ పొదలతో కప్పేశారు .

ఎలగందులలో గుప్తనిధుల తవ్వకాలు జరిగాయన్న సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది . అయితే పోలీసు ఉన్నతాధి కారులు స్పందించి లోతైన విచారణ చేపడితే తప్ప అసలు దొంగలు ఎవరనే విషయం బయటకు వచ్చేలా లేదుని . గ్రామస్థులు అంటున్నారు. ఇక ఎలాగందుల కోట చాలా పురాతన చరిత్ర ఉంది.. ఇది పూర్వపు జిల్లా గా ఉండేది .ఈ కోట ఇప్పుడు పర్యటన క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఇక్కడి పలు రాష్టల నుంచి పర్యాటకులు, వస్తూంటారు

First published:

Tags: Crime news, Karimnagar

ఉత్తమ కథలు