EX SARPANCH KILLED BY MAOIST WHO KIDNAPPED YESTERDAY VRY
Breaking : మాజీ సర్పంచ్‌ను హతమార్చిన మావోలు.. పోలీసు ఇన్ఫార్మర్ అంటూ లేఖ .. 20న కిడ్నాప్..
Ex sarpanch killed by Maoist
Breaking : మాజి సర్పంచ్‌ను హతమార్చిన మావోలు.. పోలీసు ఇన్ఫార్మర్ అంటూ లేఖ
Breaking : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల చేత కిడ్నాప్‌కు గురైన మాజీ సర్పంచ్‌ను ఇన్ఫార్మర్గా
పేర్కొంటు హతమార్చారు.
చాలా రోజుల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాలో మావోయిస్టులు తమ ప్రభావం చూపారు. పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ ఉమ్మడి జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రమేశ్‌ను హతమార్చారు. 20వ తేదీ సాయంత్రం కిడ్నాప్ తర్వాత తర్వాత కొంతమంది మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించి హతం చేశారు. రమేశ్ పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరించి కొంతమంది మావోయిస్టుల మృతికి కారణం అవ్వడంతో పాటు మరికొంతమంది ఎన్‌కౌంటర్‌కు కూడా కారణమయ్యాడని పేర్కోన్నారు. రమేశ్ హత్య అనంతరం మావోలు ఓ లేఖను విడుదల చేశారు. చత్తీస్ఘడ్,తెలంగాణ సరిహద్దు అడవుల్లో హతమార్చినట్టు చెప్పారు.
కాగా రమేశ్ కుటుంబం గత కొద్ది రోజులుగా ములుగు జిల్లా ఏటూరునాగరం లో నివసిస్తున్నారు. రమేష్ కారు డ్రైవింగ్ చేస్తుండగా ఆయన భార్య రజిత ఏటూరునాగరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తోంది. 20వ తేది సాయంత్రం కిడ్నాప్ అయిన తర్వాత రమేష్ భార్య రజిత మావోయిస్టులను వేడుకుంది. తన భర్తకు ఎలాంటీ హాని తలపెట్టవద్దని ,ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలిపెట్టాలని వేడుకుంది. కాని మావోస్టులు కిడ్నాప్ తర్వాత అంత్యంత వేగంగా స్పందించారు. కిడ్నాప్ చేసిన రమేష్‌ను హతమార్చారు. కొద్ది రోజుల క్రితమే మావోయిలు ఉమ్మడి ఖమ్మం ిజిల్లాలో కూడా టీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసి హతమార్చిన విషయం తెలిసిందే... ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మరోకరిని హతమార్చారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.