Home /News /telangana /

EX MP KONDA VISHWESHWAR REDDY SUPPORTS ETELA RAJENDAR AFTER MEETING HIM AK

Etela Rajendar: ఈటలకు మాజీ ఎంపీ మద్దతు.. తెలంగాణలో కీలక పరిణామం

మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)

మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)

Etela Rajendar: ఒకప్పుడు టీఆర్‌ఎస్‌లో ఈటలతో కలిసి పని చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి.. ఈటలను కలిసి మద్దతు ప్రకటించారు.

    తెలంగాణలో మంత్రి పదవి కోల్పోయిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్‌కు మద్దతు తెలిపారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఒకప్పుడు టీఆర్‌ఎస్‌లో ఈటలతో కలిసి పని చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి.. ఈటలను కలిసి మద్దతు ప్రకటించారు. ఈటల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని విశ్వేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఈటలను ఆయన నివాసంలో కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఈటల భార్య జమున తనకు బంధువు అని తెలిపారు. ఈటల తనకు మిత్రుడని అన్నారు. అయితే ఈటలతో రాజకీయాలు చర్చించలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలు చాలాసార్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

    ఈటల రాజేందర్ పార్టీ నమ్ముకుని ఉంటే.. బయటకు పంపించడం బాధాకరమని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈటలకు ఎలాంటి నష్టం లేదని.. ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా ఉంటామని ప్రకటించారు. మరోవైపు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఈటలకు మద్దతు ప్రకటించడం కీలక పరిణామంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఏ పార్టీలో చేరలేదు. వీరిద్దరూ కలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు