• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • EX MLA VEERA REDDY PASSES AWAY NETAS REMIND HIS SERVICES TO TELANGANA STATE NK

Ex MLA Veera Reddy: మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూత...

Ex MLA Veera Reddy: మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూత...

మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి (image credit - twitter)

Ex MLA Veera Reddy: తెలంగాణలో అనారోగ్యంతో మరో నేత మనందరికీ దూరమయ్యారు. మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మరణం ఆయన కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.

  • Share this:
    తెలంగాణలో మరో నేత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా... అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు. అనారోగ్యం బాధిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ పరిస్థితి కుదుటపడలేదు. చివరకు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూనే ఆదివారం ఉదయం వేళ కన్నుమూశారు.

    వీరారెడ్డి ఇప్పుడంటే పదవిలో లేరుగానీ... తన హయాంలో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. తనదైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందరితోనూ కలివిడిగా ఉండే మనస్తత్వం ఆయనది. ఆయన మరణంతో... కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నేతలు, నాయకులు తమ సంతాపం ప్రకటించి... కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. వీరారెడ్డితో తమ అనుబంధాన్ని, రాజకీయ జీవితాన్నీ గుర్తు చేసుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు