Hyderabad : మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యాయత్నం.. ఈసారి వాగులో దూకింది..
Hyderabad : మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యాయత్నం.. ఈసారి వాగులో దూకింది..
Hyderabad : గురువారం హైదరాబాద్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన మాజీ మిస్ తెలంగాణ మరోసారి క్రిష్ణా జిల్లాలోని కీసర బ్రిడ్జీపై నుండి వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే స్థానికులు చూసి ఆమెను కాపాడారు.
హైదరాబాద్‌లో నివాసముంటున్న మిస్ తెలంగాణ హసిని అనే యువతి ఆత్మహత్య చేసుకునేందకు యత్నించిన విషయం తెలిసిందే... తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లైవ్ వీడియోను స్నేహితులకు పంపడంతో అలర్ట్ అయిన స్నేహతులు పోలీసుల సహాయంతో ఆమె ప్రాణాలు కాపాడారు. కాగా నేడు మరోసారి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది.
మాజీ మిస్ తెలంగాణ (Miss Telengana ) ఆత్మహత్యకు ( Suicide ) యత్నించింది. హైదరాబాద్‌లోని నారాయణగూడ ( Hyderabad ) పరిధిలో నివాసముంటున్న మాజీ మిస్ తెలంగాణ హసిని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరేసుకుని బలవన్మరణానికి తెగబడింది. అయితే.. ఇంతలోనే నారాయణగూడ పోలీసులు వచ్చి ఆ యువతిని రక్షించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం హాసిని క్షేమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ఆత్మహత్యకు ( Suicide ) సంబంధించి వివరాల్లోకి వెళితే.. 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైన యువతి హాసిని. తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ని చూసిన హాసిని స్నేహితులు.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. డయల్-100 కు ఫోన్ ( dail 100 ) చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. హుటాహుటిన హిమాయత్‌నగర్ రోడ్‌నంబర్-6 లో ఉన్న హసిని ఫ్లాట్‌కి చేరుకున్నారు. అప్పటికే.. ఉరికి వేలాడుతోన్న యువతిని.. ప్రాణాలతో కాపాడారు. వెంటనే హైదర్‌గూడాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హాసిని క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. అదృష్టవశాత్తు ఉరి వేసుకున్న చీర తెగడంతో ఆమెకు ప్రాణాప్రాయం నుండి తప్పించుకుంది. దీంతో విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు ఆమెను స్వస్థలం అయిన క్రిష్ణా జిల్లాకు తీసుకుని వెళ్లారు.
స్నేహితులు ఆ పోస్టు చూడటం.. పోలీసులకు సమాచారం అందించటం... దానికి పోలీసులు కూడా సకాలంలో స్పదించటం వల్ల.. హాసిని ప్రాణాలతో బయటపడిందని ఆమె స్నేహితులు వివరించారు.. కాగా ఆత్మహత్యకు గల కారణం ఏమై ఉంటుందనేది పోలీసులు ప్రశ్నించడంతో ఆర్ధిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు తెలిపింది. అయితే తాను చాలా అవమానాలు పడ్డానని, అనేక కేసులు ఎదుర్కోన్నానని తాను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకోవడం తప్పని తెలిసినా.. తనకు ఎవరు అవసరం లేరని, గతంలో ఒకసారి ఆసిడ్ దాడితో పాటు వేధింపుల్ని ఎదుర్కొన్నానని అనేక రకాల వ్యాఖ్యలను కూడా భరించానని చెబుతూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇదంతా లైవ్ ద్వారా చూస్తున్న జగిత్యాలకు చెందిన స్నేహితుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. దీంతో పోలీసుల ముందు ఆర్థిక కష్టాలు అని చెప్పి తిరిగి తిరిగి మరోసారి చేసుకోవడం సంచలనంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.