Hyderabad : మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యయత్నం.. లైవ్ వీడియో పోస్ట్..

Hyderabad : మాజి మిస్ తెలంగాణ ఆత్మహత్య... లైవ్ వీడియో పోస్ట్..

Hyderabad : హైదరాబాద్‌లో నివాసముంటున్న మిస్ తెలంగాణ హసిని అనే యువతి ఆత్మహత్య చేసుకునేందకు యత్నించింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లైవ్ వీడియోను స్నేహితులకు పంపడంతో అలర్ట్ అయిన స్నేహతులు పోలీసుల సహాయంతో ఆమె ప్రాణాలు కాపాడారు.

  • Share this:
    మాజీ మిస్​ తెలంగాణ (Miss Telengana ) ఆత్మహత్యకు ( Suicide ) యత్నించింది. హైదరాబాద్​లోని నారాయణగూడ ( Hyderabad ) పరిధిలో నివాసముంటున్న మాజీ మిస్​ తెలంగాణ హసిని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరేసుకుని బలవన్మరణానికి తెగబడింది. అయితే.. ఇంతలోనే నారాయణగూడ పోలీసులు వచ్చి ఆ యువతిని రక్షించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం హాసిని క్షేమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

    ఆత్మహత్యకు ( Suicide ) సంబంధించి వివరాల్లోకి వెళితే.. 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైన యువతి హాసిని. తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ఈ పోస్ట్​ని చూసిన హాసిని స్నేహితులు.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. డయల్​-100 కు ఫోన్​ ( dail 100 ) చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. హుటాహుటిన హిమాయత్​నగర్ రోడ్​నంబర్-6 లో ఉన్న హసిని ఫ్లాట్​కి చేరుకున్నారు. అప్పటికే.. ఉరికి వేలాడుతోన్న యువతిని.. ప్రాణాలతో కాపాడారు. వెంటనే హైదర్​గూడాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హాసిని క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు.

    ఇది చదవండి : ఒకే వీధికి చెందిన ముగ్గురు యువతులు మిస్సింగ్.. చెరువులో శవాలుగా తేలారు.. !


    స్నేహితులు ఆ పోస్టు చూడటం.. పోలీసులకు సమాచారం అందించటం... దానికి పోలీసులు కూడా సకాలంలో స్పదించటం వల్ల.. హాసిని ప్రాణాలతో బయటపడిందని ఆమె స్నేహితులు వివరించారు.. కాగా ఆత్మహత్యకు గల కారణం ఏమై ఉంటుందనేది తెలియాల్సి ఉంది. .. అయితే హాసిని కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటోందని సన్నిహితులు చెప్పుతున్నట్టు తెలుస్తోంది.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే.. యువతి ఆత్మహత్యకు యత్నించినట్టు అంచనా వేస్తున్నారు. మరోవైపు హాసిని ఇటీవలే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో ( Jubleehills ) ఫిర్యాదు చేసింది. ఓ యువకుడు తనను లైంగికంగా వేధించాడని కాంప్లైంట్​ ఇచ్చింది. మరి తాను ఆత్మహత్యకు యత్నించడానికి వీటిలో ఏది కారణమై ఉంటుందనేది ఆమె కోలుకున్న తర్వాత గాని బయటికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.. కాగా పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది చదవండి : బెంగళూరులో దారుణ ఘటన.. ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతున్న యువతిని..


    కాగా గత మూడు రోజుల క్రితం కూడ ఢిల్లీలో ( Delhi ) పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియో పోస్టు చేసిన మూడు నిమిషాల్లోనే ఆ ప్రాంతానికి వెళ్లి ఒకరి ప్రాణాలు కాపాడారు. కేవలం పోలీసులకు సమాచారం అందుకున్న పోలీసులు మూడు నిమిషాల్లోనే మూడు కిలోమీటర్ల మేర వెళ్లి యువతి ప్రాణాలు కాపాడిన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఉరికి వేలాడుతున్న యువతి ప్రాణాలను పోలీసులు సకాలంలో స్పందించి కాపాడడం గమనార్హం.
    Published by:yveerash yveerash
    First published: