GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిపేదెలా? కరోనా టైంలో ఎన్నికల సంఘానికి సవాలు

GHMC Elections 2020: ఇదివరకు జరిగిన GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించింది. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంది?

news18-telugu
Updated: September 22, 2020, 8:01 AM IST
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిపేదెలా? కరోనా టైంలో ఎన్నికల సంఘానికి సవాలు
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిపేదెలా? కరోనా టైంలో ఎన్నికల సంఘానికి సవాలు
  • Share this:
EVMs or Ballot: తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల హడావుడి మొదలవుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌తోపాటూ... ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ... ఈ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాయి. హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చుతున్నామంటూ... టీఆర్ఎస్... ఓటర్ల మెప్పు పొందేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. గత GHMC ఎన్నికల్లో అంచనాలకు మించిన విజయం సాధించిన టీఆర్ఎస్... ఇప్పుడు కూడా అదే ఆశిస్తోంది. ఐతే... అసలీ ఎన్నికలు ఎలా జరిపించాలనే అంశం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమస్యగా, సవాలుగా మారింది. బ్యాలెట్ పేపర్ ద్వారా జరపాలా లేక... ఈవీఎం (EVM)ల ద్వారా జరపాలా అన్నది ఎటూ తేల్చుకోలేకపోయింది. దీనిపై ఈమధ్యే కొన్ని శాఖల అధికారులతో ఎస్ఈసీ పార్ధసారధి సమావేశం నిర్వహించారు.

2021.. ఫిబ్రవరిలో GHMC పాలక మండలికి పదవీకాలం పూర్తవుతుంది. అందువల్ల ఈ సంవత్సరమే ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఐతే... కరోనా ఇంకా పూర్తిగా పోలేదు కాబట్టి... ఎన్నికలు ఎలా జరపాలనే అంశంపై రాజకీయ పార్టీలనే అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఇందుకు సంబంధించి అన్ని పార్టీలకూ ఎస్ఈసీ లేఖలు పంపింది. సెప్టెంబర్ చివరికల్లా అభిప్రాయం చెప్పాలని కోరింది. నిజానికి పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి... ఎన్నికల అంశంపై చర్చిద్దామని ఎస్ఈసీ అనుకుంది. కానీ... కరోనా చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో... ఈ నిర్ణయాన్ని మార్చుకుంది.

రాజకీయ పార్టీలకు ఎస్ఈసీ పంపిన లేఖ


GHMCతోపాటూ... వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు కూడా ఎన్నికలు అదే సమయంలో జరపాలనే ఆలోచనలో ఎస్ఈసీ ఉంది. ఎందుకంటే... వచ్చే సంవత్సరం మార్చిలో... నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అందుకే అన్నింటినీ ఒకేసారి లేదా... ముందుగా GHMC ఎన్నికల ప్రక్రియ ముగించి... వెంటనే వాటికి నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఎస్ఈసీ. ఇక ఇప్పుడు బంతి... పార్టీల కోర్టులో ఉంది. పార్టీలు చెప్పే అభిప్రాయంలో... ఎక్కువ మంది ఏ అభిప్రాయాన్ని చెబితే... దాన్ని ఎస్ఈసీ అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా పార్టీలకు ఓ వారం టైమ్ మాత్రమే ఉంది. ఆలోపే అభిప్రాయాలూ, సూచనలూ చెప్పాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 తర్వాత చెప్పే అభిప్రాయాలూ, సూచనల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కలోకి తీసుకోదు.
Published by: Krishna Kumar N
First published: September 22, 2020, 8:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading