హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు అడిగిన ప్రతి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం మీనామేషాలు లెక్కపెట్టకుండా ముందుకు వస్తుంది. దీంతో కుల సంఘాల నుండి నామిటేటెడ్ పదవుల వరకు ..ఇక అభివృద్ది పరంగా ఏది అడిగితే దాన్ని వెను వెంటనే వారికి అందజేస్తున్నారు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పథకాలు సైతం ఇప్పుడు హుజూరాబాద్ నుండే ప్రారంభం అవుతున్నాయి.
ముఖ్యంగా వేల కోట్ల రూపాయలను దళిత బంధు పథకం ద్వారా ఆ నియోజకవర్గం ప్రజలకు అందించేందుకు సీఎం కేసిఆర్ రెడీ అయ్యారు. అందుకోసం కార్యచరణ రూపోందుతుండగానే...గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు సమస్యను కూడా అక్కడి నుండే పరిష్కరించారు. మరోవైపు సామాజిక వర్గాల లభ్ధి కోసం వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు స్థలంతో పాటు, యాబై లక్షల రూపాయలు కూడా కేటాయించారు. ఇందుకు సంబంధించి హామీలు ఇవ్వడమే కాదు మంత్రులు అక్కడే మాకం వేసి వెంటవెంటనే మంజూరు చేస్తున్నారు. రోజుల తేడాలోనే వారికి పత్రాలు, డబ్బులు అందజేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ సిటీ సంటర్ హాళ్లో జరిగిన సమావేశంలో ఆటోనగర్ కోసం భూ మంజూరు పత్రాలను యూనియన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యే కు ఆటోనగర్ కోసం విజ్ణప్తి చేసినా స్పందించలేదన్నారు. ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉండాలని ఆయన కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, Gangula kamalakar, Huzurabad By-election 2021