Home /News /telangana /

EVERY DROP OF GODAVARI WATER SHOULD BE UTILISED IN TELANGANA CM KCR SAYS VRY

CM KCR : కరువు వచ్చినప్పుడు... కాళేశ్వరం విలువ తెలుస్తుంది..! సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

CM KCR : ప్రతి ఎకరం గోదావరి నీటితో తడవాలే...

CM KCR : ప్రతి ఎకరం గోదావరి నీటితో తడవాలే...

CM KCR : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరం గోదవరి నీటితో అనుసంధానం కావాలని సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు. ఇందుకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల పర్యటన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటీ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇంకా చదవండి ...
  ఆదివారం సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసిఆర్ బిజిబిజీగా గడిపారు. పలు ప్రారంభోత్సవాలు, సమావేశాల్లో పాల్గోన్నారు. అనంతరం కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి ప్రాజెక్టులు, సాగునీటి పారుదల అంశాలపై ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆయన పలు సూచనలు చేశారు.

  ఈ క్రమంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలనా సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. ఎన్నో కష్టాలుపడి లిప్టుల ద్వారా సాగునీటిని ఎత్తిపోసుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నామని చెప్పారు. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పూర్తి సామర్ధ్యంతో వినియోగించుకోవాల్సిన అవసరముందని చెప్పారు.

  అయితే కరువు వచ్చినపుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత మరింత అర్థమవుతుందని వివరించారు. అటువంటి కరువు కష్టాలను అధిగమించడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించుకున్నామని చెప్పారు. ఇక నుంచి కరువుకు, కాలానికి సంబంధం లేకుండా ఏ కాలం లోనైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. నీళ్లను ఎత్తిపోసి నిండుకుండలా జలాశయాలను నిర్మించుకున్న తర్వాత కూడా గోదావరి పరివాహక ప్రాంతాలైన కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి సమస్య అనేమాటే వినబడకూడదని సీఎం అన్నారు. అందుకు చిన్నపాటి లిఫ్టులు ఏర్పాటు చేసుకొని వానాకాలం ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన ప్రదేశాలకు ఎత్తిపోసుకోవాలని సూచించారు. ఎత్తు మీదినుంచి తిరిగి గ్రావిటీ విధానం ద్వారా సాగునీటిని పొలాలకు మళ్లించుకోవాలని సూచించారు.

  ’’నేను కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన. వాటిని వినియోగించుకునే బాధ్యత మీదే‘‘ అని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లకు సీఎం స్పష్టం చేశారు.జూలై 10 తర్వాత, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండలస్థాయి ఇరిగేషన్ అధికారులు కూర్చొని, సాగు నీరును మూలనా ఎట్లా పారించాలో చర్చలు జరపాలన్నారు. కాంటూర్ లెవల్స్, ఎంఎండిఎల్ తో సహా అన్ని రకాల సాంకేతిక అంశాల పట్ల అవగాహన పెంచుకొని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఒక్క గ్రామం, ఒక్క ఎకరము వదలకుండా తడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు సహా ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

  నెత్తిమీద నీళ్లు పెట్టుకొని కరీంనగర్ జిల్లా బాధపడటం సరికాదన్నారు. అప్పర్ మానేరు కరీంనగర్ జిల్లా వర ప్రదాయని అని, అప్పర్ మానేర్ కు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ఇకనుంచి కరీంనగర్ జిల్లాలో రైతులు రోహిణీ కార్తెలోనే నాటు వేసుకునేలా చూసే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులేనన్నారు.

  కాళేశ్వరం ప్రాజెక్ట్ టెయిల్ ఎండ్ ప్రాంతాల్లోనే నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పుడు, ప్రాజెక్టుల పక్కన, రిజర్వాయర్ల వెంట ఉన్న బాల్కొండ, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి, కరీంనగర్, మానకొండూర్, రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో నీరు లభించకపోవడమేమిటి అని ప్రశ్నించారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: CM KCR, Karimangar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు