EVEN MAN HAVING THREE WIVES HE KIDNAPPED 12 YEARS OLD GIRL FOR ONE WEEK AND RAPED ON HER IN MAHABUBNAGAR HSN MBNR
ముగ్గురు భార్యల ముద్దుల మొగుడి నిర్వాకం.. 12 ఏళ్ల ఓ బాలికను ఆటోలో తీసుకెళ్లి వారం రోజుల పాటు..
ప్రతీకాత్మక చిత్రం
అతడికి ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు భార్యలు. ఆరుగురు సంతానం. కొంత కాలంగా కుటుంబ కలహాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం 12 ఏళ్ల ఓ బాలికను కిడ్నాప్ చేసి..
మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోగల దేవరకద్ర మండలంలో 12 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. దేవరకద్ర మండలంలోని కోళ్ల ఫారం లో పని చేస్తున్న సూపర్వైజర్ ఇటీవల కొన్ని రోజులుగా విధులకు రావడం లేదు. దీంతో అక్కడ పనిచేసే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన 42 ఏళ్ల సాజిత్ కు కోళ్ల ఫారం యజమాని సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించారు. తమ కుమార్తెను సాజిద్ అపహరించాడని అక్కడ పనిచేసే ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నవాబుపేట మండల కేంద్రంలో బాలికను గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నిందితుడిపై అత్యాచారం, ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈనెల 12న బాలికను ఆటోలో అపహరించి తీసుకెళ్లిన నిందితుడు.. 19వ తేదీ రాత్రి నవాబుపేట మండల కేంద్రంలో బాలిక దొరికేవరకు వారం రోజుల పాటు ఎక్కడెక్కడ తిప్పాడు? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? అతడికి సహకరించిన ఆటో డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు నవాబుపేట నుంచి పారిపోయారు.
సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడి ఆచూకీ లభించడం లేదు. దీంతో పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అయితే నిందితుడికి ముగ్గురు భార్యలు ఉన్నారని విచారణలో పోలీసులకు తెలిసి అవాక్కయ్యారు. వారికి ఆరుగురు సంతానం ఉన్నారు. కుటుంబ గొడవల కారణంగా కొన్ని రోజులుగా వారి దగ్గర ఉండటం లేదని పోలీసులు విచారణలో తేలింది. దీన్నిబట్టి పోలీసులు రంగంలో దిగి నాలుగు బృందాలుగా ఏర్పడి బంధువుల వద్ద అతడి ఆచూకీ కోసం చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.