EVEN AT THE AGE OF 83 HE MADE A STATUE OUT OF LOVE FOR HIS WIFE IN GADWAL DISTRICT MBNR VB
Telangana News: అతడికి 83 ఏళ్లు.. కానీ భార్యపై ప్రేమ తగ్గలేదు.. ఆ ప్రేమకు ప్రతిరూంగా అతడు ఇలా చేశాడు..
విగ్రహం వద్ద అతడి కుటుంబసభ్యులు
Telangana News: భార్య భర్తల, ఆలుమగలు ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. ఈ బంధం అనేది వీడదీయలేని అనుబంధం. వారిని ఎవరు విడదీసినా, తీయకపోయినా కాలం రూపంలో విడదీస్తుంది. అందులో ఒకరు ఎప్పటికైనా ఒంటరి కావాల్సిందే. కానీ ఆ ఘటన చదివితే ఆ ఒంటరి అనే ఫీలింగ్ పోతుంది.
భార్య భర్తలు, ఆలుమగలు ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. ఈ బంధం అనేది వీడదీయలేని అనుబంధం. వారిని ఎవరు విడదీసినా, తీయకపోయినా కాలం రూపంలో విడదీస్తుంది. అందులో ఒకరు ఎప్పటికైనా ఒంటరి కావాల్సిందే. అది ఎప్పుడు జరుగుతుందనేది కాలమే నిర్ణయం తీసుకుంటుంది. కొంతమంది తమ ని విడిచి వెళ్లిపోయిన భాగస్వామి ని మర్చిపోలేక లోలోపలే బాధపడతారు. అందురూ దాదాపు ఇలానే చేస్తారు. కానీ ఇక్కడ ఓ ఘటనలతో తన భార్య మరణాన్ని తట్టుకోలేక పోయాడు. ఆమె పక్కన లేదనే ఆలోచనను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో అతడికి ఓ ఆలోచన వచ్చింది. తన భార్య జ్ఞాపకాల్లో కాకుండా కళ్ల ముందు ఉండాలనుకున్నాడు.
ఒక ఆలోచనతో ముందుకి వెళ్లాడు. తన భార్య పోలికలతో వున్న ఒక విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించాడు. భార్య ని ఇంతలా ప్రేమించే ఆ వ్యక్తి చేయించిన తన భార్య విగ్రహం వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.. భార్యపై ప్రేమతో ఓ వృద్ధుడు మండపంలో తన సహచరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణానికి చెందిన గంటల బోయిన హనుమంతు అతని వయసు 83 సంవత్సరాలు.
ఇతడి భార్య 2019 సెప్టెంబర్ 9 న మృతి చెందారు. భార్య పై ప్రేమతో ఆ వృద్ధుడు రూ. 7 లక్షల వ్యయంతో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి అందులో తన భార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. గతంలో తన సొంత పొలంలో దాతల సహాయంతో పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి నిత్యం పూజలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఈ ఆలయం పక్కనే తన సొంత పొలంలో భార్యకు మండపాన్ని ఏర్పాటు చేశారు. హనుమంతుకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు, హనుమంతు తన భార్యకు పూజలు నిర్వహిస్తున్న పుల్లా ఆంజనేయస్వామి గుడికి వచ్చే భక్తులు ఆశ్చర్యంగా చూస్తారు. ఇంత వయసులో ఉన్న భార్యపై ఉన్న ప్రేమ తగ్గలేదు అంటూ పలువురు భక్తులు అనుకుంటారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.