హోమ్ /వార్తలు /తెలంగాణ /

etela rajenderపై ప్రతీకారం.. టీఆర్ఎస్‌ క్లర్కుగా కలెక్టర్ హరీశ్.. cm kcrపైనా జమున ఫైర్

etela rajenderపై ప్రతీకారం.. టీఆర్ఎస్‌ క్లర్కుగా కలెక్టర్ హరీశ్.. cm kcrపైనా జమున ఫైర్

ఈటల జమున, మెదక్ కలెక్టర్ హరీశ్.

ఈటల జమున, మెదక్ కలెక్టర్ హరీశ్.

‘జమునా హ్యాచరీస్ భూములపై కలెక్టర్ హరీశ్ ఏ హక్కుతో ప్రెస్ మీట్ పెడతారు? భూముల వివరాలను కోర్టుకు సమర్పించకుండా, కనీసం సర్వే రిపోర్టును మాకు కూడా చెప్పకుండా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి కబ్జాలు నిజమేనని నిర్ధారించడంలో ఉద్దేశం, అర్థం ఏమిటో అందరికీ సులువుగా అర్థమవుతోంది. మరో జిల్లా కలెక్టర్ టీఆర్ఎస్ లో చేరాడా? కలెక్టర్ హరీశ్ గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ క్లర్కుగా పనిచేస్తున్నాడా?..’

ఇంకా చదవండి ...

సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగడానికి,.. టీఆర్ఎస్ తో రెండు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకుని ఈటల బీజేపీలో చేరడానికి.. అనూహ్య రీతిలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడానికి కారణమైన భూకబ్జా వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగింది. ఈటల కుటుంబం యజమానులుగా ఉన్న జమునా హ్యాచరీస్.. హైదరాబాద్ శివారు మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్ భూముల్ని ఆక్రమించుకుందనే ఆరోపణ ముమ్మాటికీ వాస్తవమని, ఈటల సంస్థలు మొత్తం 70.33ఎకరాలను ఆక్రమించుకుందని జిల్లా కలెక్టర్ హరీవ్ నిర్ధారించడంపై ఈటల జమున సంచలన రీతిలో కౌంటరిచ్చారు. ఈటలపై సర్కారు ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తమకున్నది 8.36 ఎకరాల భూమేఅని, కలెక్టర్ చెబుతోన్న 70.33 ఎకరాల కబ్జా శుద్ద అబద్దమని, జిల్లా మెజిస్ట్రేట్ గా ఉండి హరీశ్ ఇలాంటి అబద్దాలు, అసత్యాలు చెప్పేకంటే నేరుగా గులాబీ కండువా కప్పుకొని అధికార పార్టీ ఏజెంటుగా మాట్లాడితేనైనా అర్థం ఉంటుందని జమున మండిపడ్డారు. శామీర్ పేటలోని నివాసంలో నిన్న రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ భూకబ్జా వ్యవహారంపై తమ వెర్షన్ వినిపించారు.

కలెక్జర్ హరీశ్ కు జమున కౌంటర్

కరోనా విలయం, హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఈటల భూకబ్జా వ్యవహారంపై ఫోకస్ పెంచిన కేసీఆర్ సర్కార్ దానిపై సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. భూకబ్జా రిపోర్టును కోర్టులో సమర్పించడానికి ముందే, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ సోమవారం నాడు ప్రెస్ మీట్ పెట్టిమరీ ఈటల భూకబ్జా నిజమేనని నిర్ధారిస్తూ సంబంధిత ఆధారాలను చూపించారు. సర్వే వివరాలను తమకు ఇవ్వకుండా కలెక్టర్ నేరుగా ప్రెస్ మీట్ పెట్టడమేంటని ఈటల జమున ఎదురుప్రశ్నించారు. ధరణి పోర్టల్ లో ఎంట్రీ అయిన భూములను మాత్రమే జమున హ్యాచరీస్ కొనుగోలుచేసిందని, లాయర్ ద్వారా లీగల్ గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, తమకున్నది 8.36 ఎకరాలే అయితే కలెక్టర్ మాత్రం 70.33 ఎకరాలని చెప్పడాన్ని చూస్తే ధరణి పోర్టల్ వల్ల ఉపయోగమే లేదన్నట్లు అనిపిస్తోందని జమున అన్నారు. భూకబ్జాపై కలెక్టర్ రిపోర్టులు, వ్యాఖ్యలను ఖండిస్తూ ఈటల సతీమని రాత్రి వేళ ప్రెస్ మీట్ నిర్వహించారు.

High Court: కుటుంబంలో కన్న కూతురు కంటే కోడలికే ఎక్కువ హక్కులుంటాయి.. ఆమె విధవరాలైనా సరే..



ఈటల భూబాగోతం నిజమే

భూకబ్జా ఆరోపణలు, ఫిర్యాదులపై హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించామన్న మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్.. ఈటల భార్య జమున, కొడుకు నితిన్ రెడ్డిలతోపాటు అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన 156 మందికి నోటీసులు జారీ చేశామని, గత నెల 16వ తేదీ నుంచి 15 రోజులపాటు సర్వే నిర్వహించామని, అచ్చంపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 77నుంచి 82 వరకు, 130 నంబర్, హకీంపేటలో సర్వీ నంబర్లు 97,111లో జమునా హ్యాచరీస్ కబ్జాకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధాలున్నాయని, ఈటల కుటుంబం మొత్తం 70.33 ఎకరాలను కబ్జా పెట్టిందని కలెక్టర హరీశ్ చెప్పారు. అంతేకాదు, జమునా హ్యాచరీస్ వివిధ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు కూడా రిపోర్టులో పేర్కొన్నారు. జమునా హ్యాచరీస్ లో కోళ్ల పెంపకం వల్ల వచ్చే వ్యర్ధాలతో వాతావరణం కాలుష్యమైందని, స్థానిక ఎల్కం చెరువు నీటితోపాటు భూగర్భజలాలు కలుషితం అయ్యాయని, ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోందని రిపోర్టులో పొందుపర్చినట్లు కలెక్టర తెలిపారు.అచ్చంపేట గ్రామంలో సర్వే నంబర్ 81, 130 నిషేధిత జాబితాలో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా వాటిపై చేసుకున్న రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. కాగా,

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..



టీఆర్ఎస్ క్లర్కుగా కలెక్టర్

భూకబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ రూపొందించిన నివేదికపై ఈటల జమున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘జమునా హ్యాచరీస్ భూములపై కలెక్టర్ హరీశ్ ఏ హక్కుతో ప్రెస్ మీట్ పెడతారు? భూముల వివరాలను కోర్టుకు సమర్పించకుండా, కనీసం సర్వే రిపోర్టును మాకు కూడా చెప్పకుండా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి కబ్జాలు నిజమేనని నిర్ధారించడంలో ఉద్దేశం, అర్థం ఏమిటో అందరికీ సులువుగా అర్థమవుతోంది. మరో జిల్లా కలెక్టర్ టీఆర్ఎస్ లో చేరాడా? కలెక్టర్ హరీశ్ గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ క్లర్కుగా పనిచేస్తున్నాడా? ఈ విషయంలో కలెక్టర్ పై కచ్చితంగా కేసు పెడతాం. అసలు భూరికార్డులకు సంబంధించి సీఎం కేసీఆర్ ఏమన్నారు?

Waseem Rizvi : ఇస్లాంను వదిలేసి హిందువుగా మారిన యూపీ షియా వక్ఫ్‌బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ



ఇది ముమ్మాటికీ ప్రతీకారమే

తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేని భూములే ధరణిలోకి ఎక్కుతాయని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు. 2019లో అలాంటి భూములనే మేం కొన్నాం. మాకున్నది 8.36 ఎకరాలే. కలెక్టర్ చెబుతోన్న 70.33 ఎకరాలతో మాకసలు సంబంధమే లేదు. ఒకవేళ ఆక్రమణే అనుకున్నా గడిచిన రెండేళ్లుగా ఏం చేశారు? ఇది కచ్చితంగా ఈటలపై ప్రతీకర చర్య కిందికే వస్తుంది. రాజకీయ ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోవాలని కానీ ఇలా తప్పుడు దారుల్లో కాదు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కేసీఆర్ సర్కారు ఇలా ఒక మహిళా వ్యాపారవేత్త మీద దాడి చేయడం సరైన పద్దతి కాదు..’’అని ఈటల జమున మండిపడ్డారు.

First published:

Tags: CM KCR, Etela rajender, Jamuna hatcheries, Land kabja issue, Medak, Telangana govt, Trs

ఉత్తమ కథలు