Eetala Rajender : ఆస్తులు పోయినా సరే నేను భయపడను.. ఇవాళ ఒక్కన్నే...నా వెంట ప్రజలు ఉన్నరు..

మంత్రి ఈటల రాజేందర్ (ఫైల్)

Eetala Rajender : సీఎం కు నిజాయితీ, నిష్పక్షపాతం ఉంటే వేల కంపనీలకు అసైన్డ్ భూములు ఎంత కేటాయించారో ఎన్ని భూములు దుర్వినియోగం అయ్యాయో చెప్పాలని ఈటల అన్నారు. ఈటల రాజేందర్ బెదిరింపులకు లోంగిపోడని హెచ్చరించారు.

 • Share this:
  చావునైనా భరిస్తాను కాని, ఆత్మగౌరవం పోగొట్టుకోనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. తాను ఎందుకు సీఎంతో దూరం అయ్యానో ఆయన అంత:రాత్మకు తెలుసని ఆయన చెప్పారు. తాను ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిని కాబట్టే సీఎంతో అంటిముట్టనట్టు ఉంటున్నట్టు చెప్పారు. ఆత్మగౌరవం లేని చోట తాను ఇముడ లేనని చెప్పారు. కమిట్ మెంట్ ధైర్యం ఉంది ఉంది కాబట్టే ఇన్నాళ్లు సీఎం కేసీఆర్‌తో కలిసి ఉద్యమం చేశానని చెప్పారు. ఇక భూముల కబ్జాపై స్థానిక సర్పంచ్ మాట్లాడిన సంఘటన చాలని అంతకంటే సీఎం పై ఎక్కువ చేప్పలేనని అన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని వ్యవస్థలు శాశ్వతం అని సీఎంకు హితవు పలికారు.

  ఇరవై సంవత్సరాల పాటు సీఎంతో కలిసి తిరగానని కాని సీఎం మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అణచివేత చేస్తే.. నిన్న వచ్చిన తీర్పులే నిదర్శనమని అన్నారు. ఒకవేళ అరాచకం చేసినా...వాటికి బయబడి పారిపోయోవాడు ఈటల రాజేందర్ కాదని అన్నారు. సీఎం కేసిఆర్ చెప్పినట్టు అధికారులు వింటున్నారని, కనీసం నాకు సంబంధం లేకుండా.. కలెక్టర్ నోటీసు కూడ ఇవ్వకుండా వందల మంది పోలీసును పెట్టి భయాందోళనకు గురి చేసే కుట్రకు తెరలేపారని మరోసారి ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు సుమారు 20 సంవత్సరాలు కలిసి పని చేశానని పార్టీకి ఎప్పుడు ఎలాంటీ తలవంపులు తెచ్చే పనులు చేయాలేదని స్పష్టం చేశారు.

  కాని పదవులు ఎప్పుడు శాశ్వతం కాదని ఆయన చెప్పారు. మనుష్యుల కోసం వ్యవస్థలను నాశనం చేయడం కరెక్టు కాదని అన్నారు. ఇన్నాళ్లు నన్ను తమ్ముడు అని చెప్పినవాడు నేడు ఒక్కసారిగా దొంగగా మారతాడని ఎలా అనుకున్నారని అన్నారు. తన ఎమ్మెల్యే పదవి రాజీనామా నియోజక వర్గం ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దేవరంజాలులో ఆయనకు ఆరున్నర ఎకరాలు తప్ప మొత్తం భూమి తాను కొనుక్కున్నదేనని చెప్పారు. నానానికి రెండు వైపుల గుర్తులు ఉంటాయని వాటిని గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు.నన్ను ప్రేమకు లోంగిపోయోవాడినని కాని, ఇలా బెదిరింపుల ద్వార బయపడనని చెప్పారు.
  Published by:yveerash yveerash
  First published: