• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • ETELA RAJENDER MAY RESIGN TO TRS PARTY HE IS GOING TO CONDUCT PRESS MEET TODAY VRY

Eetala Rajender : టీఆర్ఎస్‌కు ఈటల గుడ్‌ బై ? మరి కాసెపట్లో మీడియా సమావేశం ..

Eetala Rajender : టీఆర్ఎస్‌కు ఈటల గుడ్‌ బై ? మరి కాసెపట్లో మీడియా సమావేశం ..

కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Eetala Rajender :మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన భవిష్యత్ కార్యచరణపై తేల్చేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆయన కొంత సైలంట్ గా ఉన్న ఆయన ఆయన సన్నిహితులు, అభిమానులతో సమావేశం అయ్యారు. దీంతో పార్టీకి రాజీనామా చేయడంతోపాటు భవిష్యత్ కార్యచరణనను ప్రకటించనున్నారు.

  • Share this:
    మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన భవిష్యత్ కార్యచరణపై తేల్చేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆయన కొంత సైలంట్ గా ఉన్నాడు..రెండు రోజులుగా జరిగిన పరిణామాల తర్వాత స్వంత నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. దీంతో పార్టీని వీడేందుకు ఆయన సిద్దమయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నట్టు సమాచారం. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యచరణపై మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

    తనపై సీఎం కేసీఆర్ ఉద్దేశ్యపూర్వకంగా కుట్రకు తెరలేపారని భావిస్తున్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి
    రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఆయనపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే..మున్సిపల్ ఎన్నికలు ముగిసిన కాసేపటికే...ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడంతో పాటు ఆయనపై విచారణకు సైతం సీఎం ఆదేశించారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే జిల్లా కలెక్టర్ తోపాటు ఇతర విజిలెన్స్ అధికారులు భూకబ్జాకు గురైన హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో పర్యటించి..నివేదికలు తయారు చేశారు. ఒక్క రోజులోనే ఆరోపణలు ఎదుర్కోంటున్నట్టుగా.. అసైన్డ్ భూమిని ఈటల కబ్జాకు గురైనట్టు అధికారులు పేర్కోన్నారు.

    అయితే ఈ పరిణామాలపై మాములుగానే స్పందించిన ఈటల రాజేందర్ తాను ఎలాంటీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆరోపణలపై సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక భవిష్యత్ పరిణామాలపై త్వరలో స్పందిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ ప్రజలతో సమావేశం అవుతానని చెప్పారు. దీంతో ఆయన పార్టీ రాజీనామాకు సిద్దపడ్డట్టు సమాచారం.

    మరోవైపు ఆయన పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే
    టీఆర్ఎస్ అసమ్మతి వాదులు ఈటలను కలిసి మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏ
    ముఖ్యనాయకులు ఆయనకు మద్దతు పలికారు. ఆయన ఏం చేయబోతున్నారనే దానిపై నేడు స్పష్టత
    ఇవ్వనున్నారు. కాగా భూ కబ్జా ఆరోపణల్లో రెండు రోజుల క్రితం స్పందించిన ఈటల ఇతర నేతలు, మంత్రులు అనేక కోట్ల రూపాయలు సంపాదించారని,వారికి లేని అభ్యంతరం నాపై ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. ఇందుకోసం ఆయన మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏయో అంశాలపై మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

    .
    Published by:yveerash yveerash
    First published:

    అగ్ర కథనాలు