Home /News /telangana /

ETELA RAJENDER EXPLAINS WHY HE IS NOT TAKING FIRST COVID VACCINE TELANGANA SU

Etela Rajender: నేడు కోవిడ్ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదో వెల్లడించిన మంత్రి ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)

మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)

తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌లిసి ప్రారంభించారు.

    నేడు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఇక, తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌లిసి ప్రారంభించారు. గాంధీ ఆస్ప‌త్రిలో స‌ఫాయి క‌ర్మ‌చారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ కృష్ణ‌మ్మ తెలంగాణలో తొలి క‌రోనా టీకా తీసుకుంది. అయితే తెలంగాణలో తొలి కరోనా వ్యాక్సిన్ తానే తీసుకుంటానని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ సామర్థ్యంపై ప్రజలు అనుమానాలు పెట్టుకోవద్దని మంత్రి పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు మొదటి టీకాను తానే తీసుకోనున్నట్టు శుక్రవారం ప్రకటించారు.

    దీంతో తెలంగాణలో మొదటి టీకాను మంత్రి ఈటల తీసుకుంటారని అంతా భావించారు. అయితే తొలి టీకాను కృష్ణమ్మకు ఇచ్చారు. దీంతో తొలి టీకా వేయించుకుంటానని చెప్పిన ఈటల.. ఎందుకు తీసుకోలేదని చర్చ ప్రారంభమైంది. అటువంటి ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ.. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనాపై యుద్ధం చేస్తున్నారని గుర్తుచేశారు. కరోనాపై పోరులో కొందరు ప్రాణ త్యాగాలు కూడా చేశారని చెప్పారు. అందుకే ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రధాని మోదీ కూడా సూచించారని అన్నారు. దీంతో తెలంగాణలో సఫాయి కర్మచారి కృష్ణమ్మకే తొలి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. అందుకే తాను ఈరోజు వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. రాష్ర్ట వ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. ప్రారంభంలో ప్ర‌తి కేంద్రంలో 30 మందికి మాత్ర‌మే టీకాలు వేస్తామ‌న్నారు.

    Telangana Covid 19 Vaccination: తెలంగాణలో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్.. తొలి టీకా తీసుకుంది ఎవరంటే..

    వ్యాక్సిన్ కోసం ఎవ‌రూ తొంద‌ర ప‌డొద్దని మంత్రి ఈటల రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రాధాన్య‌త క్ర‌మంలో అంద‌రికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుతుందని చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్ర‌క్రియ నిరంత‌రం కొన‌సాగే ప్ర‌క్రియ అని మంత్రి స్పష్టం చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Corona Vaccine, Coronavirus, Etela rajender

    తదుపరి వార్తలు