Home /News /telangana /

ETELA RAJENDAR SUGGESTIONS TO BJP NATIONAL PRESIDENT JP NADDA REGARDING STRENGTHENING OF BJP IN TELANGANA AK

JP Nadda Etela Rajendar Meet: బీజేపీ హైకమాండ్‌కు ఈటల కీలక సూచనలు... 45 నిమిషాలు భేటీ

ఈటల రాజేందర్, జేపీ నడ్డా (ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్, జేపీ నడ్డా (ఫైల్ ఫోటో)

Etela Rajendar: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నించారని.. అయితే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఆయనకు లభించలేదని తెలుస్తోంది.

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలంగాణ మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక సూచనలు చేశారు. త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో కలిసి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఎదిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. అందులో తన పాత్ర ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయన జేపీ నడ్డాతో చర్చించినట్టు తెలుస్తోంది.

    తెలంగాణలో బీజేపీ రాజకీయంగా ఎదిగేందుకు ప్రస్తుతం అనువైన పరిస్థితులు ఉన్నాయని జేపీ నడ్డాకు వివరించిన ఈటల రాజేందర్.. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అందుకు తగ్గట్టుగా నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించినట్టు సమాచారం. జేపీ నడ్డాతో ఈటల రాజేందర్ సుమారు 45 నిమిషాలు పాటు సమావేశమైనట్టు తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. అయితే ఆయన ఎప్పుడు పార్టీలో చేరే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

    మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నించారని.. అయితే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఆయనకు లభించలేదని తెలుస్తోంది. మరోవైపు రేపు ఢిల్లీలో కిషన్ రెడ్డితో ఈటల రాజేందర్ భేటీ ఉంటుందని.. ఈ భేటీలో మరిన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశం తరువాత ఈటల రాజేందర్ ఎఫ్పుడు బీజేపీలో చేరతారనే అంశంపై ఓ స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు