కొంగరకలాన్‌‌‌పై కేసీఆర్ ఫోకస్, మంత్రి ఈటల కీలక ప్రకటన

‘కోవిడ్ వల్ల నిమ్స్‌లో కొన్ని సర్వీసులు నిలిపివేశాం. మళ్ళీ వారం రోజుల్లో ఈ సేవలు అన్నీ ప్రారభింస్తాం.’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల ప్రకటించారు.

news18-telugu
Updated: October 2, 2020, 9:57 PM IST
కొంగరకలాన్‌‌‌పై కేసీఆర్ ఫోకస్, మంత్రి ఈటల కీలక ప్రకటన
నిమ్స్‌లో సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్
  • Share this:
తెలంగాణలోనే ప్రతిష్టాత్మక ఆస్పత్రి నిమ్స్ లో సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ విభాగం ఏర్పాటుచేయడం ద్వారా దేశంలో ఒక గొప్ప హాస్పిటల్ గా నిమ్స్ ఎదిగిందని ఈటల రాజేందర్ అన్నారు. గతంలో ఇలాంటి పరీక్షలు చేయడానికి శాంపిల్స్ ఢిల్లీ కి పంపించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని మంత్రి అన్నారు. రోజుకి పది వేల పరీక్షలు చేయగల సత్తా ఇప్పుడు నిమ్స్ కు ఉందని ప్రకటించారు. ‘బ్లడ్ కాన్సర్ ఉన్న వారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ విభాగాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల రక్త కాన్సర్ తో బాధపడుతున్న పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిచనున్నాం. ఇప్పటికే కిడ్నీ, గుండె మార్పిడి లో, స్టెమ్ సెల్ థెరపీ లో ఎక్కువ రిజల్ట్ హాస్పిటల్ నిమ్స్. కోవిడ్ వల్ల కొన్ని సర్వీసులు నిలిపివేశాం. మళ్ళీ వారం రోజుల్లో ఈ సేవలు అన్నీ ప్రారభింస్తాం. ఈ రోజు స్టెమ్ సెల్, మొలిక్యులయర్ లాబ్ ను ప్రజలకు అంకితం చేశాం’ అని మంత్రి ఈటల ప్రకటించారు.

‘ICMR లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం లో 40 లక్షల మందికి యాంటీ బాడీస్ అభివృద్ది చెందాయి. కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రం మొదటి నుండి ఏం చెప్పిందో, ఏం చేసిందో అదే కరెక్ట్ అని ఇప్పుడు తేలిపోయింది. ప్లాస్మా థెరపీల పేరిట, తోసలీజుమాబ్ ఇంజెక్షన్ల పేరిట దోపిడీ చేయడం తప్ప మనిషిని బ్రతికించలేమని చెప్పాం. అదే నిజం అయ్యింది. రూ.10 వేలు పెడితే మామూలు లక్షణాలు ఉన్న వారికి నయం చేయవచ్చు అని చెప్పినం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవన్నీ నిజం అయ్యాయి. కొద్ది రోజుల్లో డెంగీ, వైరల్ ఫేవర్స్, మామూలు వైరల్ ఫీవర్స్, H1 N1, మలేరియాతో ఎలా సహజీవనం చేసినమో అలానే సహజీవనం చేయాల్సి వస్తుంది. కరోనాకి చంపగలిగే శక్తి లేదు కానీ కొంత అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్ ల పేరిట ప్రతి ఇంటిని తాకింది. ఎక్కడిక్కడ పరీక్షలు చేయడం, మందుల కిట్స్ ఇవ్వడం, హోమ్ ఐసోలేషన్ లో, ప్రభుత్వ ఐసోలేషన్ లో పెట్టడం, PHC, సెకండరీ, టెర్శరీ కేంద్రాలలో చికిత్స అందించాం. వీటి ద్వారా పూర్తి స్థాయి లో కరోనాను అదుపులో ఉంచగలిగాం. రాబోయే కాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే నిమ్స్ లో ఓపీ సేవలు మొదలు పెడతాం. అయితే ఎమర్జెన్సీ లో అంబులెన్స్ లో వచ్చిన వారికి కొంత ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని కూడా అతి త్వరలో అధిగమిస్తాం. సీఎం కేసీఆర్ ఔట్ పేషెంట్ సేవలు పెంచమని గతంలో ఆదేశించారు. అందుకోసం 250 కోట్లతో ఓపీ బ్లాక్, క్రిటికల్ కేర్ యూనిట్ మొదలు పెడుతున్నాం. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం. ఇప్పుడు 2500 మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. భవిష్యత్తులో 5 వేల మందికి సేవలు అందిచేలా చూస్తాం. హైదరాబాద్ చుట్టూ నాలుగు పెద్ద ఆసుపత్రులు కట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకు అనుగుణంగా బీబీ నగర్ ఎయిమ్స్ వచ్చింది. గచ్చిబౌలిలో TIMS వచ్చింది. ఇక షామీర్ పేట –మేడ్చల్ వైపు ఒకటి, కొంగరకలాన్ వైపు ఒక హాస్పిటల్ పెట్టబోతున్నాం. కోవిడ్ వచ్చిన తరువాత వైద్య రంగంలో మన స్థానం ఏంటో తెలిసపోయింది. ఈ శాఖను మరింత బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. తప్పకుండా మరింత బలోపేతం చేస్తాం. వైద్యానికి డబ్బులు లేక శవాలుగా మారే పరిస్థితి రాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 2, 2020, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading