Home /News /telangana /

ETALA RAJENDAR FIRE ON TRS LEADERS VB KNR

Etala Rajender: ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి.. చిల్లర రాజకీయాలు చేస్తారా..

 ఈటల రాజేందర్ (ఫైల్)

ఈటల రాజేందర్ (ఫైల్)

Etala Rajender: స్వయంగా సీఎం కేసీఆర్ రివ్యూ పెట్టీ మరీ ..ఏ జిల్లాలో మంత్రులు ఆ జిల్లాలో కొవిడ్ సేవలు పర్యవేక్షించాలని చెప్పి, అనివార్యమైన పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కానీ కరీంనగర్ జిల్లాలో అందుకు బిన్నంగా జిల్లా ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి, హుజురాబాద్ ప్రజా ప్రతినిధుల మీద గొర్ల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు చేస్తున్నారన్నారు.

ఇంకా చదవండి ...
  తెలంగాణ కు చైతన్యాన్ని నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారని.. తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మంత్రిగా బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి ఈటల విమర్శించారు. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిచాల్సిన సమయం ఇది.. రాజకీయాలు, వెకిలిచేష్టలుకు సమయం కాదన్నారు. ఇక నైనా ఆపండి లేదంటే తీవ్రపరిణామాలు ఉంటాయని మాజీ మంత్రి ఈటల హెచ్చరించారు. తెలంగాణ లో కోవిడ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సోకి అనేక మంది చనిపోతున్నారు. స్వయంగా సీఎం రివ్యూ పెట్టి మరీ ఏ జిల్లాలో మంత్రులు ఆ జిల్లాలో కొవిడ్ సేవలు పర్యవేక్షించాలని చెప్పి అనివార్యమైన పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టారు. కానీ కరీంనగర్ జిల్లాలో అందుకు బిన్నంగా జిల్లా ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి హుజురాబాద్ ప్రజప్రతినిధుల మీద గొర్ల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు చేస్తున్నారు. అక్కడ ఉన్నవారంతా 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి ఆత్మగౌరవ బావుటా ఎగురవేసి న వారిపై ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని మంత్రి, ముఖ్యమంత్రి నియమించిన కొంతమంది ఇంఛార్జి లు అదే పనిగా సర్పంచ్ లు ఎంపీటీసీ లకి ఫోన్ చేసి డబ్బులు ఆశ చూపడం, ప్రలోభాలకు గురి చేయడం బిల్లులు రావని బెదిరిస్తున్నారు. వారికి ఇష్టం లేకపోయినా కూడా వారితో వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు.

  పిడికెడు మంది స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ప్రజాభిప్రాయాన్ని మారుస్తా అనుకోవడం వెర్రి బాగులతనం మాత్రమేనన్నారు. హుజురాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతం ఉన్నవారు, ఆత్మగౌరవం ఉన్నవారు. ఇలాంటి చిల్లర మల్లర చర్యలు తిప్పికొడతారన్నారు. మీరెప్పుడైనా నియోజకవర్గానికి వచ్చారా అని ప్రశ్నించారు. 20 ఏళ్ల నుండి కష్టపడుతున్న వారిని మనోవేదనకు గురిచేస్తే సహించనన్నారు.కరోనా పేషెంట్లు ను కాపాడడం చేయండి.. తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయకండి వీటిని హుజురాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా తిప్పికొడతారన్నారు. సమైఖ్య రాష్ట్రం లో కూడా ఇలాంటి ప్రయత్నం చేసి భంగ పడ్డారు. ఇప్పుడు కూడా మీకు అది తప్పదు, సరైన సమయంలో ఘోరీ కడతారని ఘాటు విమర్శలు చేశారు.

  ఇరవై ఏళ్లుగా ఉద్యమంలో పాల్గొన్న వారిని కోడి తన పిల్లలను రెక్కల కింద కాపాడుకున్నట్లు కాపాడుకుంటున్నా.. ఇప్పుడు ఇలాంటి వారు వచ్చి తల్లిని పిల్లని వేరు చేసినట్లు చేస్తున్నారు. ప్రలోభ పెడితే ఇబ్బంది పెడితే కొంత మంది మాట్లాడుతుండవచ్చు.. కానీ వారి అంతరాత్మ మాత్రం నా తోనే ఉంటుంది. ఇరవై ఏళ్లుగా వారి జీవితాలతో పెనవేసుకొని ఉన్న వారందరినీ కాపాడుకుంటానన్నారు. అంతిమ విజయం న్యాయానిది, ధర్మానిది తప్ప కుట్రలు ఎప్పుడు విజయం సాధించవన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: CM KCR, Etala rajendar, Etela rajender, FIRE, Huzurabad By-election 2021, Karimnagar, Leaders, Politics, Trs, TRS leaders

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు