• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • ESTABLISHMENT OF HOSTELS FOR CATTLE IN SIDDIPET TELANGANA BN

పశువులకు హాస్టల్స్.. ఎక్కడో తెలుసా..?

పశువులకు హాస్టల్స్.. ఎక్కడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

గ్రామానికి చెందిన అన్ని గొర్రెలు ఒకేచోట ఉండడంతో కాపలా సులభం కావడంతో పాటు గ్రామాల్లోనూ పారిశుద్ధ్యం మెరుగుపడింది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హారీశ్రావు ఇదే తరహాలో పశువులకూ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని భావించారు.

 • Share this:
  పశువులకు హాస్టల్స్.. అవును మీరు విన్నది నిజమే. పశువులకు హాస్టల్స్ ఉన్నాయి. ఎక్కడో కాదు తెలంగాణలోని సిద్ధిపేటలోనే. పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మంత్రి హరీష్ రావు చొరవతో గ్రామాల్లో పశువులకు హాస్టల్స్ నిర్మాణాలు చేపట్టారు. పాడి పశువులు అనారోగ్యానికి గురికాకుండా చూడడం.. పాల ఉత్పత్తి పెండంతో పాటు పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ లక్ష్యంగా సిద్ధిపేటలో పశువుల హాస్టల్స్ ఏర్పాటు అవుతున్నాయి. సిద్ధిపేటలోని ఇబ్రహీంపూర్, ఇర్కోడ్, నర్మెట.. మూడు గ్రామాల్లో సామూహిక గొర్రెల పాకలు నిర్మించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. వీటి వల్ల గ్రామానికి చెందిన అన్ని గొర్రెలు ఒకేచోట ఉండడంతో కాపలా సులభం కావడంతో పాటు గ్రామాల్లోనూ పారిశుద్ధ్యం మెరుగుపడింది.

  దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హారీశ్రావు ఇదే తరహాలో పశువులకూ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని భావించారు. అందులో భాగంగానే పొన్నాల, ఇరుకోడ్, మిట్టపల్లి, ఇబ్రహీంపూర్, జక్కపూర్, గుర్రాలగొండి, నర్మెట,గట్లమాల్యాల గ్రామాల్లో ఈ పశువుల హాస్టల్ నిర్మాణాలు చేపట్టారు. త్వరలోనే అధికారులు వీటిని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ ఒక్కో హాస్టల్‌ను దాదాపు రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. పాడిపశువులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.

  ఎండాకాలంలో ఫ్యాన్, వానకాలంలో తడవకుండా రూఫ్, చలికాలంలో పశువులకు చలి పెట్టకుండా చుట్టుపక్కల గోడలు, ఓపెన్ ఉన్న వైపు చిన్న టార్ఫాలిన్లను బిగించారు. సీజను ఏదైనా.. పశువులు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానికంగా పశువులకు హాస్టల్స్ ఏర్పాటు చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
  First published: