హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : మేజర్ ప్రాబ్లమ్‌కి సింపుల్ సొల్యూషన్ .. లైంగిక, అత్యాచార బాధిత మహిళల కోసమే అవి ఏర్పాటు

Telangana : మేజర్ ప్రాబ్లమ్‌కి సింపుల్ సొల్యూషన్ .. లైంగిక, అత్యాచార బాధిత మహిళల కోసమే అవి ఏర్పాటు

(BHAROSA CENTER)

(BHAROSA CENTER)

Women Safety: వేధింపులతో బాధపడుతున్న బాలికలు, యువతులు, మహిళల కోసం స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ఐదు జిల్లాలలో సఖి కేంద్రాలు నిర్వహిస్తుండగా కొత్తగా పోక్సో కేసులు పెరుగుతుండటంతో ఆ బాధితుల కోసం పోలీస్ శాఖ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది.

ఇంకా చదవండి ...

  (Syed Rafi,News18,Mahabubnagar)

  వేధింపులతో బాధపడుతున్న బాలికలు, యువతులు, మహిళల కోసం స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలోని ఐదు జిల్లాలలో సఖి కేంద్రాలు నిర్వహిస్తుండగా కొత్తగా పోక్సో కేసు(POCSO case)బాధితుల కోసం పోలీస్ శాఖ(Police Department) భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదట జోగులంబ గద్వాల(Jogulamba Gadwala)జిల్లాలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం(Bharosa center) నిర్మాణాన్ని మొదలుపెట్టారు.

  మహిళల రక్షణ, భద్రత కోసం..

  అత్యాచార, లైంగిక కేసుల్లో బాధితులు, వేధింపులకు గురవుతున్న మహిళలు, బాలికలు, యువతులు తమపై జరుగుతున్న అఘాయిత్యాలపై ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాళ్లకు భరోసా కల్పించేందుకు మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా భరోసా కేంద్రం భవన నిర్మాణాన్ని ప్రారంభించారు జిల్లా ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు. జోగులమ్మ గద్వాల జిల్లాలో గత నెల 23న అద్దె భవనంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. బాధితురాళ్లకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. బాధితురాళ్లకు సఖి కేంద్రంలో ఉంచి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాలికలకు సత్వర న్యాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎస్పీ. జిల్లాల్లో పోక్సో కేసులు ఎక్కువగా నమోదువడం కారణంగా వాటిని నివారించడానికి గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

  వయసుతో సంబంధం లేకుండా సఖి సేవలు..

  ఇంట్లో, బయట సమాజంలో , పని, ఉద్యోగం చేసే ప్రదేశాల్లో హింస, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలు నేరుగా సఖి కేంద్రాలకు రావచ్చు. బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి వివరాలను తెలుసుకోవడంతో పాటు వారికి వైద్య సేవలు అందిస్తారు. ఈ భరోసా కేంద్రాల్లో బాధితురాళ్లకు ఆశ్రయం కల్పిస్తారు మానసికంగా దృఢంగా వివరించేలా స్ఫూర్తి కలిగిస్తారు. వివాహితులు అయితే భర్తలను పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. ఇద్దరు అంగీకరిస్తే ఇంటికి పంపుతారు. ఒకవేళ కేసు నమోదు చేయాలంటే మహిళా పోలీసు స్టేషన్ లో గృహహింస కేసు నమోదు చేయిస్తారు. కోర్టులో భరణం వచ్చిన భర్తలపై కేసు వేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు సఖి కేంద్రం ద్వారా 31 మంది భరణం కేసులు ద్వారా ప్రతినెల పరిహారం పొందుతున్నారు.

  Telangana : భారీ వర్షాలకు కొట్టుకుపోయిన నేషనల్ హైవే163 ..వరంగల్ - ఏటూరునాగారం మధ్య రాకపోకలు బంద్


  పోక్సో కేసులు పెరగడం వల్లే ..

  18 ఏళ్ల లోపు వయసున్న బాధిత బాలికల కోసం పోలీస్ శాఖ భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఫోక్సో కేసు నమోదు కాగానే బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకువచ్చి వాగ్మూలం సేకరిస్తారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు బాలిక వాగమూలాల్ని ప్రవేశపెడతారు. ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించడంతోపాటు భరోసా కేంద్రంలోని బాధితురాలిని ఉంచి ఆమె మానసికంగా దృఢంగా మారేలా కౌన్సిలర్స్ అవగాహన కల్పిస్తారు. బాధితురాలికి న్యాయ సలహా అందిస్తారు. పోక్సో కేసులను చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుకు సమర్పిస్తారు. వాదనల సమయంలో కోర్టుకు వచ్చే బాధితురాలు నేరం చేసిన వ్యక్తికి కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకోసం కోర్టు ప్రవేశం ద్వారా ప్రత్యేకంగా ఉండేలా చూస్తారు త్వరగా బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు.

  Child marriage : తండ్రికి తెలియకుండానే నైన్త్ క్లాస్‌ విద్యార్ధినికి పెళ్లి, శోభనం..చేసిందెవరో తెలిస్తే షాక్ అవుతారు  ఫోక్స్ కేసులు ఎప్పుడూ నమోదు చేస్తారు..

  18 ఏళ్ల లోపు బాలికలను వేధించినా, ప్రేమ పేరుతో మోసం చేసినా వారితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నా ... అత్యాచారం చేసిన తర్వాత ఏదైనా కారణాలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసినా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారు. మైనారిటీ తీరని బాలిక ఇష్టపూర్వకంగా యువకుడు, లేదా బాలుడితో ఇల్లు వదిలి వెళ్లిపోయిన వివాహం చేసుకున్న లైంగిక సంబంధాలు పెట్టుకున్న ఆ యువకుడు బాలుడిపై ఫోక్స్ కేసు నమోదు అవుతుంది. భరోసా కేంద్రాల్లో .ఎస్సై స్థాయి మహిళా అధికారితో పాటు ఒక కౌన్సిలర్ న్యాయ సలహాదారులు ఉంటారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mahabubnagar, Telangana News

  ఉత్తమ కథలు