• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • ERRAGADDA MENTAL HOSPITAL RUSHED WITH PATIENTS REGARDING LIQOUR DISTRESS MK

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంకు ఒకే రోజు 100 మంది పేషంట్లు...

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంకు ఒకే రోజు 100 మంది పేషంట్లు...

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం

రెండు రోజుల క్రితం వరకూ 30-40 వరకు పేషంట్లు వస్తే అందులో 4 వరకు మద్యం కేసులు ఉండేవి. కానీ సోమవారం ఒక్కరోజే 100 ఓపి కేసులు మద్యానికి సంబందించినవి వచ్చాయని తెలిపారు.

  • Share this:
    లాక్ డౌన్ కార‌ణంగా మ‌ద్యం షాపులు బంద్ కావ‌డంతో మ‌ద్యంకు బానిసైన వారు పిచ్చిప‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్, ఎర్ర‌గ‌డ్డ‌లోని మాన‌సిక విక‌లాంగుల హాస్పిట‌ల్ కు క్యూ క‌డుతున్నారు. నాలుగు రోజులుగా మందు బాబుల కేసులు ఎక్కువైన‌ట్లు ఎర్రగడ్ద మానసిక వైద్యశాల సూపరిండెంట్ డా. ఉమా శంకర్ తెలిపారు. రెండు రోజుల క్రితం వరకూ 30-40 వరకు పేషంట్లు వస్తే అందులో 4 వరకు మద్యం కేసులు ఉండేవి. కానీ సోమవారం ఒక్కరోజే 100 ఓపి కేసులు మద్యానికి సంబందించినవి వచ్చాయని తెలిపారు. వచ్చిన వారందరికీ చికిత్స అందిస్తున్నాం అవసరమైన వారికి అక్కడే అడ్మిట్ చేసుకొని మిగిలిన వారిని పంపిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మద్యం ,కళ్ళు తాగడం వల్ల ఒక్కసారిగా తాగడానికి దొరకాకపోవడం తో వారి ప్రవర్తన వింతగా మారిందని, ఎక్కువగా కల్తీ కల్లులో కలిపే క్లోరోఫామ్, డైజోఫామ్ వాడడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

    మందుకు బానిసలుగా మారిన వ్యక్తులపై దృష్టి పెట్టి…వారు మానసిక ఆందోనకు గురికాకుండా చూడాలన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్… లిక్కర్ షాపులు మూసివేయడం…మద్యానికి వ్యసనంగా మారి వింతగా ప్రవర్తిస్తున్న వారి విషయాలపై చర్చించారు. దీనిపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మద్యానికి బానిసలుగా మారిన వ్యక్తులు ఎక్కువగా ఆందోళనకు గురైతే ఎక్సైజ్ శాఖ సిబ్బంది… అలాంటి వ్యక్తులను గుర్తించి వారికి మానసిక వేదనకు గురికాకుండా సరైన అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే వారిని దగ్గర్లో ఉన్న PHC సెంటర్లకు తరలించి ట్రీట్ మెంట్ అందించాలన్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు