ఏపీ కాదు.. వరంగల్‌లో అడ్డా.. టాలీవుడ్‌కు తెలంగాణ మంత్రి విజ్ఞప్తి

వరంగల్‌లో జరిగిన 'సరిలేరు నీకెవ్వరు' విజయోత్సవ సభలో మహేష్ బాబు, రష్మిక, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, దిల్ రాజు, అనిల్ రావిపూడి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.


Updated: January 17, 2020, 10:43 PM IST
ఏపీ కాదు.. వరంగల్‌లో అడ్డా.. టాలీవుడ్‌కు తెలంగాణ మంత్రి విజ్ఞప్తి
ఎర్రబెల్లి దయాకర్ రావు
  • Share this:
సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ మంచి విజయం అందుకుంది. అదిరిపోయే కలెక్షన్‌లతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం వరంగల్‌లో విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రష్మిక, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, దిల్ రాజు, అనిల్ రావిపూడి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రబెల్లి దయాకర్ రావు.. టాలీవుడ్ ప్రముఖులకు కీలక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని టాలీవుడ్ అడ్డాగా ఎంచుకోవాలని కోరారు.

''సినిమా వాళ్లు హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అడ్డాగా ఎంచుకోవాలి. విజయవాడ కాదు. వైజాగ్ కాదు. వరంగల్‌లో సినిమాలు తీయాలి. అనిల్ రావిపూడికి విజయవాడ, వైజాగ్ అంటే ప్రేమ ఎక్కువ. మీరు అటు లాగొద్దు. మా వంశీ, దిల్ రాజు ఇటే గుంజుకొస్తారు. మీరు అటు గుంజొద్దు. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను సినీ అడ్డాగా మార్చేందుకు నా వంతు కృషి చేస్తా. సీఎం కేసీఆర్, కేటీఆర్ సహకారంతో సినీ ప్రముఖులకు ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తాం. కాళేశ్వరంతో వరంగల్ జిల్లా కోనసీమలా మారింది.'' అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రసంగం:
First published: January 17, 2020, 10:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading