హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabubnagar : శ్రీవారికి తెలంగాణ ఎరువాడ పంచెలు.. 400 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రాదాయం..

Mahabubnagar : శ్రీవారికి తెలంగాణ ఎరువాడ పంచెలు.. 400 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రాదాయం..

Mahabubnagar : శ్రీవారికి తెలంగాణ ఎరువాడ పంచెలు..

Mahabubnagar : శ్రీవారికి తెలంగాణ ఎరువాడ పంచెలు..

Mahabubnagar : తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు వెంకటేశ్వర స్వామికి దర్శింపజేసే పట్టు వస్త్రాలను తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా నుంచి పంపే సాంప్రదాయం గత 400 ఏళ్లుగా కొనసాగుతోంది.

ఇంకా చదవండి ...

  న్యూస్ 18 మహబూబ్ నగర్.. సయ్యద్ రఫీ...

  చేనేత కార్మికులు స్వయంగా నేచిన ఎరువాడ జోడు పంచేలు స్వామివారికి తరింప చేయడం 400 ఏళ్లుగా ఈ ఆనవాయితీగా వస్తుంది. వీటిని సెప్టెంబర్ నెలలోని 30 న శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారి పాదాల వద్ద ఉంచారు. కృష్ణా నది తుంగభద్ర నదుల మధ్య గద్వాల ప్రాంతం ఉండడంతో వీటిని ఏరు వాడ జోడు పంచెలుగా నామకరణం చేశారు. గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏరువాడ జోడు పంచెలను చేనేత కార్మికుల చేత తయారు చేయించి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటిరోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది.

  ఇక ఈ ఆచారం మరుగున పడకుండా గద్వాల సంస్థానానికి చెందినవారు చేనేత కార్మికులు ఎవరికో ఒకరికి జోడు పంచెలు తయారీ బాధ్యత ఇస్తూ వస్తున్నారు. గత 12 ఏళ్లుగా చేనేత కార్మికుడు మహంకాళి కరుణాకర్ ఏరువాడ జోడు పంచెలు తయారీ చేస్తున్నారు. శ్రావణ మాసంలో మొదటిరోజు నుంచి 41 రోజులపాటు ఏరువాడ జోడు పంచెలను ముగ్గురు కార్మికులు నియమనిష్టలతో 11 గజాల పొడవు రెండున్నర గజాల వెడల్పు 15 అంగులాల అంచుతో చేస్తున్నారు...

  400 ఏళ్లుగా ఏరు వాడ జోడు పంచలు తయారుచేసి శ్రీ వెంకటేశ్వర స్వామి సమర్పించడం సంస్థానాధీశుల కాలం నుంచి వస్తుంది ఈ పంచెలను మా పూర్వీకులు నుంచి తయారు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. నేను పన్నెండేళ్లుగా ఏరువాడ జోడు పంచలు తయారు చేస్తూ శ్రీవారి పాదాలు చెంతన ఉంచుతున్నాం. బ్రహ్మోత్సవాల మొదటిరోజు గద్వాలలో తయారు చేయించిన ఎరువాడ జోడు పంచెలను స్వామివారికి ధరింపజేసి అలంకరిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే స్వామి వారికి ఈవో రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులకు సమర్పించాము వీటిని తయారు చేయడం వల్ల తెలంగాణలోని చేనేత కార్మికులు సుఖ సంతోషాలతో ఉంటారని అని మా నమ్మకం అని చెబుతున్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Mahabubnagar, Ttd news

  ఉత్తమ కథలు