హోమ్ /వార్తలు /తెలంగాణ /

SAD NEWS: సాఫ్ట్‌పేర్ జాబ్‌లో చేరాల్సిన కొడుకు ఇంటికొచ్చాడు .. తిరిగి వెళ్లలేదు.. ఏం జరిగిందంటే ..!

SAD NEWS: సాఫ్ట్‌పేర్ జాబ్‌లో చేరాల్సిన కొడుకు ఇంటికొచ్చాడు .. తిరిగి వెళ్లలేదు.. ఏం జరిగిందంటే ..!

dengue death

dengue death

SAD NEWS: కొడుకు ఉజ్వల భవిష్యత్తుపైన ...అతడి నూరేళ్ల జీవితంపైనే ఎన్నో ఆశ‌లు పెట్టున్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. ఒకటి రెండ్రోజుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాల్సిన బీటెక్ స్టూడెంట్ తల్లిదండ్రుల్ని విడిచి శాశ్వతంగా దూరమయ్యాడు. అసలేం జరిగిందంటే.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kamareddy, India

  (P.Mahendar,News18,Nizamabad)     

  తానోక‌టి త‌లిస్తే దైవం మ‌రొక‌టి తలచింది. బీటెక్ (B.Tech)పూర్తి చేసిన కొడుకుకు ఉద్యోగం వ‌చ్చింద‌ని సంతోషప‌డే లోపే దేవుడు డెంగీ (Dengue)బారిన ప‌డేసి మృత్యువు ఒడికి చేర్చాడు. కొడుకు ఉజ్వల భవిష్యత్తుపైన ...అతడి నూరేళ్ల జీవితంపైనే ఎన్నో ఆశ‌లు పెట్టున్న తల్లిదండ్రులకు కొడకు క‌ళ్ల ముందే శ‌వమై పడి ఉండటం చూస్తూ ఎంతో ఆవేద‌న పడ్డారు. చెట్టంత ఎదిగిన కొడుకు చేయూతగా ఉంటాడని భావించిన ఆ కుటుంబ సభ్యులనే కాదు స్థానికుల్ని కంట తడిపెట్టుకునేంతగా బాధించింది. ఈవిషాద సంఘటన కామారెడ్డి(Kamareddy)జిల్లాలో చోటుచేసుకుంది.

  Sad news : కూల్‌ డ్రింక్ బాటిల్ నోట్లో పెట్టుకున్నందుకు ఐదేళ్ల చిన్నారికి ఎంత శిక్ష పడిందో తెలుసా..?

  పాతికేళ్లకే నూరేళ్లు నిండాయి..

  కామారెడ్డి జిల్లా బిక్క‌నూర్ మండ‌లం ర్యాగ‌ట్లప‌ల్లి గ్రామానికి చెందిన‌ రాజేశ్వర్ రెడ్డి, మ‌మ‌త దంప‌తులకు భ‌ర‌త్‌రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. హైద‌రాబాద్‌లోని గొక‌రాజు రంగ‌రాజు ఇంజీనీరింగ్ క‌ళాశాలో బీటెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. భ‌ర‌త్‌రెడ్డి తండ్రి రాజేశ్వ‌ర్ రెడ్డి  ఆర్మీలో పని చేస్తున్నారు.  తల్లి మమత గృహిణి. ఆగ‌స్టు 30న  క్యాంపస్ ఇంటర్వూ నిర్వ‌హించారు. అయితే భ‌ర‌త్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మంచి ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. అదే విషయాన్ని తల్లిదండ్రులతో పాటు బంధువులు, మిత్రులు, గ్రామస్తులకు చెప్పుకొని తన సంతోషాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు.

  శోకసంద్రంగా మారిన గ్రామం..

  సెప్టెంబర్ 13న అనారోగ్యానికి గురయ్యాడు భరత్‌రెడ్డి. కొడుకు అనారోగ్యంతో ఉండటంతో జమ్మూకశ్మీర్‌లో ఉన్న తండ్రి రాజేశ్వర్ రెడ్డి స్వ‌గ్రామానికి వ‌చ్చారు. భ‌ర‌త్‌రెడ్డిని ట్రీట్‌మెంట్ కోసం మిలిటరీ ఆస్పత్రిలో చేర్పించారు.  పరీక్షలు నిర్వహించిన వైద్యులు  డెంగీ సోకినట్లు నిర్దారించారు. వారం రోజులుగా   చికిత్స చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.  ఆదివారం తుది శ్వాస విడిచాడు. దీంతో త‌ల్లి దండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. చేతికి వ‌చ్చిన కొడుకు వారి క‌ళ్ల ముందే శవంగా పడివుండటాన్ని చూసి తట్టుకోలేకపోయారు. కొడుకు భరత్‌రెడ్డి అంత్యక్రియలను ర్యాగట్లపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో భరత్‌రెడ్డి చదువుతున్న కాలేజీకి చెందిన 500మంది పాల్గొన్నారు. భరత్‌రెడ్డి మనప్రభుత్వ విప్ గంప గోవర్దన్ తో పాటు పలుపు నాయకులు ర్యాగట్లపల్లికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Kamareddy, Telangana News

  ఉత్తమ కథలు