ENGINE SEPARATED FROM TRAIN COACH NARROWLY ESCAPED FROM MAJOR ACCIDENT IN STATIONGHANTPUR HSN
వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడన్ గా విడిపోయిన ఇంజన్.. ప్రయాణికుల్లో టెన్షన్.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం
రైలు అప్పుడే ఓ స్టేషన్ దాటింది. క్రమక్రమంగా వేగం పుంజుకుంటోంది. ఇంతలోనే ఊహించని సంఘటన జరిగింది. రైలు ఇంజిన్, బోగీలకు ఉన్న లింక్ తెగిపోయింది. ఫలితంగా ఇంజన్ ఒక్కటే దూసుకెళ్లిపోసాగింది. దీన్ని గుర్తించిన రైల్వే గార్డు వెంటనే..
రైలు అప్పుడే ఓ స్టేషన్ దాటింది. క్రమక్రమంగా వేగం పుంజుకుంటోంది. ఇంతలోనే ఊహించని సంఘటన జరిగింది. రైలు ఇంజిన్, బోగీలకు ఉన్న లింక్ తెగిపోయింది. ఫలితంగా ఇంజన్ ఒక్కటే దూసుకెళ్లిపోసాగింది. దీన్ని గుర్తించిన రైల్వే గార్డు వెంటనే లోకో పైలట్ కు సమాచారం ఇచ్చాడు. దీంతో లోకోపైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. రైలింజన్ ను వెంటనే ఆపేయడం, ఆ తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో భారీ ప్రమాదం తప్పినట్టయింది. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని దానాపూర్ కు వెళ్లే రైలు సికింద్రాబాద్ నుంచి మంగళవారం ఉదయం 9.50 గంటలకు బయలుదేరింది. ఈ రైలుకు 15 బోగీలు ఉన్నాయి. కొవిడ్ నిబంధనల కారణంగా ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న వారినే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
ఉదయం 9.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు స్టేషన్ ఘన్ పూర్ రైల్వేస్టేషన్ కు ఉదయం 11గంటల సమయంలో చేరింది. స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఉదయం 11.10 నిమిషాల సమయంలో బోగీలకు ఇంజన్ కు ఉన్న లింక్ తెగిపోయింది. దీన్ని గమనించి రైల్వే గార్డు వెంటనే లోకోపైలట్ కు సమాచారం ఇచ్చారు. దీంతో పైలట్ వెంటనే అప్రమత్తమయి ఇంజన్ నుఆపేశారు. అప్పటికే రైలింజన్ అరకిలోమీటర్ దూరం వరకు వెళ్లిపోయింది. రైలు బోగీలు పట్టాలపైనే నిలిచిపోవడం, బోగీ మాత్రం దూసుకెళ్లిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
దీంతో వాళ్లంతా రైలు దిగి దగ్గరలోనే ఉన్న స్టేషన్ కు చేరుకున్నారు. రైల్వే అధికారులు వచ్చి సమస్య ఏంటన్నది పరిశీలించారు. ఆ తర్వాత ఇంజన్ ను , రైలును లింక్ చేశారు. ఇంజన్ కు, బోగీలకు మధ్య అనుసంధానంగా ఉండే కప్లింగ్ ఊడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు. సమస్య పరిష్కారం కావడంతో తిరిగి మధ్యాహ్నం 12 గంటల సమయంలో రైలు తిరిగి యథాతథంగా ప్రయాణమయింది. దాదాపు 50 నిమిషాల పాటు అసలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.