హైదరాబాద్ కంపెనీలో 146 కేజీల బంగారు ఆభరణాలు సీజ్..

నోట్ల రద్దు చేసిన రోజు జనం పెద్ద ఎత్తున పాత రూ.500, రూ.1000 నోట్లను బంగారం కొనుగోలు కోసం వినియోగించారు. దీంతో ఆ కస్టమర్లకు పాత డేట్లతో బిల్లులు రూపొందించి ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది.

news18-telugu
Updated: April 18, 2019, 8:45 PM IST
హైదరాబాద్ కంపెనీలో 146 కేజీల బంగారు ఆభరణాలు సీజ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ బంగారు ఆభరణాల కంపెనీకి సంబంధించి రూ.82 కోట్ల విలువైన 146 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. నోట్ల రద్దు సమయంలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడించింది. హైదరాబాద్, విజయవాడలోని ముసద్దీలాల్ జ్యువెలర్స్ సంస్థలు, ఆ కంపెనీ ప్రమోటర్ కైలాష్ గుప్తా నివాసం, బాలాజీ గోల్డ్ అనే కంపెనీ, ఆ సంస్థ భాగస్వామి పవన్ అగర్వాల్, మరో కంపెనీ అష్టలక్ష్మి గోల్డ్, ఆ సంస్థ ప్రమోటర్ నీల్ సుందర్, చార్టెడ్ అకౌంటెంట్ సంజయ్ సర్దా ఇళ్లలో కొన్ని రోజులుగా ఈడీ అధికారులు సోదాలు చేసినట్టు తెలిపింది. ఈ సందర్భంగా వారి నుంచి రూ.82 కోట్ల విలువైన 145.89 కేజీల బంగారాన్ని సీజ్ చేసినట్టు వెల్లడించింది.

ఆ కంపెనీలు, వ్యక్తులపై మనీలాండరింగ్ కింద ఈడీ అధికారులు క్రిమినల్ కేసులు పెట్టారు. నోట్ల రద్దు సమయంలో ఈ బంగారు ఆభరణాల సంస్థలు పెద్దఎత్తున మోసానికి పాల్పడినట్టు ఈడీ విచారణలో తెలిసింది. నోట్ల రద్దు చేసిన రోజు జనం పెద్ద ఎత్తున పాత రూ.500, రూ.1000 నోట్లను బంగారం కొనుగోలు కోసం వినియోగించారు. దీంతో ఆ కస్టమర్లకు పాత డేట్లతో బిల్లులు రూపొందించి ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. ఆ రకంగా సుమారు పాత డేట్లతో 5200 బిల్లులు సృష్టించినట్టు తెలిసింది. పాన్ నెంబర్ కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా రూ.2లక్షల కంటే తక్కువ నగదు లావాదేవీలు జరిపినట్టు విచారణలో తెలిసింది.
First published: April 18, 2019, 8:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading