కళ తప్పిన ప్రేమికుల రోజు.. బోసిపోయిన పార్కులు

హైదరాబాద్ నగరంలో ప్రేమికుల రోజు పార్కులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ హెచ్చరికలతో ప్రేమికులు పార్కులకు రావడం మానేశారు.

news18-telugu
Updated: February 14, 2020, 2:03 PM IST
కళ తప్పిన ప్రేమికుల రోజు.. బోసిపోయిన పార్కులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వైపు ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పార్కులు, హోటల్స్, పర్యాటక ప్రాంతాల్లో ప్రేమికులు సందడి చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో మాత్రం పార్కులన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి. ప్రేమికుల రోజు సందడిగా మారే పార్కులన్నీ ఎవరూ లేక కళతప్పాయి. అసలు ఈరోజూ ప్రేమికుల దినోత్సమేనా అన్న అనుమానాలొచ్చే పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన హెచ్చరికలే. పార్కుల్లో ప్రేమజంటలు కన్పిస్తే.. అక్కడికక్కడే పెళ్లి చేయడంతో పాటు తల్లిదండ్రుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని ఇప్పటికే వారు ప్రకటించారు. దాంతో ప్రేమికులు పార్కుల వైపు తొంగిచూడడం మానేశారు. కనీసం సాధారణ రోజుల్లో వచ్చే యువత సైతం పార్కుల్లో కన్పించకపోవడం గమనార్హం.

గతంలో ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. పార్కులు ప్రేమ జంటలతో కళకళలాడేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రేమికులు ట్రెండ్‌ను మార్చేశారు. పార్కుల నుంచి కాస్త హోటల్స్, రెస్టారెంట్లకు తమ మకాం మర్చారు. పార్కులకు వెళ్లి పరేషాన్ అయ్యే కంటే.. హోటళ్లు, రెస్టారెంట్లలో కూర్చోని తాపీగా ఊసులాడుకోవచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం పలు హోటల్స్, రెస్టారెంట్లలో రద్దీ పెరిగింది. వాటిలోకి వెళ్లలేని ప్రేమికులు ఆన్‌లైన్‌ను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఉన్న సౌకర్యాల ఆధారంగా వీడియో కాలింగ్, ఎస్ఎంఎస్‌లు, వాయిస్ చాటింగ్‌తో తమ కబుర్లను చెప్పకుంటున్నారు.

ఈ క్రమంలోనే భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్కుల్లోకి ప్రేమికులు రాకుండా అడ్డుకుంటున్నారు. అందులో భాగంగానూ ఏలాంటి వివాదస్పద ఘటనలు చోటుచేసుకోకుండా భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నగరంలోని కొన్ని పార్కులను సైతం ఇప్పటికే పోలీసులు మూసేశారు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు