అందోళ‌న‌కు దిగిన ఉపాధి హామి కూలీలు ...

కామారెడ్డి జిల్లాలో ఉపాధిహామి కూలీలు ఆందోళ‌న

త‌మ‌కు కూలీ డ‌బ్బులు స‌రిపోవ‌డం లేద‌ని.. రోజుకు 200 రూపాయలు కూలీ ఇవ్వాలని డిమాండ్

  • Share this:
    కామారెడ్డి జిల్లాలో ఉపాధిహామి కూలీలు ఆందోళ‌న‌కు దిగారు.. త‌మ‌కు కూలీ డ‌బ్బులు స‌రిపోవ‌డం లేద‌ని.. రోజుకు 200 రూపాయలు కూలీ ఇవ్వాలని డిమాండ్ చేసారు.. నిజాంసాగర్ మండలం బంజపల్లి గ్రామంలోని 300 మంది ఉపాధి కూలీలు అందరూ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వ‌ద్ద నిర‌స‌న తెలిపారు.. ప్రభుత్వం ప్రతి కూలీ కి 230 రూపాయిలు ఇవ్వాలని పేర్కొంది.. కానీ మాకు మాత్రం రోజుకు 40 నుండి 50 రూపాయిల కూలీ ఇస్తున్న‌ర‌ని మండిప‌డ్డారు.. ఉపాధి హమి ప‌నులు జ‌రిగే చోట‌ సరైన సదుపాయాలు క‌ల్పించాడం లేదు.. కానీసం తాగునీరు, టెంట్ కూడా ఎర్పాటు చేయాడం లేదని వారు వాపోయారు.. గ్రామ క్షేత్ర సహాయకులు లేకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శిలు నిర్వహిస్తున్నారు. వారు గ్రామాల్లో ఉండే కొందరికి మాస్టర్లు యింఇచ్చిన హాజరు పట్టికలో పనికి వచ్చిన కూలీల పేర్లు నమోదు చేసి ఇవ్వాలని కార్యదర్శి లు చెప్పారు.. కానీ వారు పనికి రాకుండా ఇంటి దగ్గర ఉన్నవారి పేర్లును కూడా రాయడంతో ప‌నిచేసిన వారికి కూలీ తగ్గుతుంద‌ని చెప్పారు.. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ల కుటుంబ సభ్యులపేర్లు ను కూడా పని చేయకుండా నే మాస్టర్లో రాయడంతో కూలీలు ఆందోళనలు చేపట్టారు. కరోనా లాక్ డౌన్ కార‌ణంగా డబ్బులు లేక కుటుంబ పోషణ భారం కావ‌డంతో ఉపాధి హామీ పనులకు వెళ్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాకు అన్యాయం జరుగుతుందని ఎంపీడీఓ కు పిర్యాదు చేసారు.
    Published by:Venu Gopal
    First published: