Home /News /telangana /

ELECTRICITY CHARGES LIKELY TO BE HIKED IN TELANGANA SK

తెలంగాణలో పెరగనున్న కరెంట్ చార్జీలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రజా ప్రయోజనాల కోసమే సాగునీటి ప్రాజెక్టులను వాడుతున్నందున.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వాడే విద్యుత్‌‌ టారిఫ్‌ పెంచకుండా పబ్లిక్‌ యుటిలిటీ కేటగిరీలో చూపించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

    తెలంగాణలో కరెంటు చార్జీలు బాదుడుకు రంగం సిద్ధమైంది. డొమెస్టిక్‌, కమర్షియల్‌, ఇండస్ట్రియల్‌.. ఇలా అన్ని కేటగిరీలకు చార్జీల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్‌‌ అధికారులతో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. చర్చల అనంతరం...చార్జీల పెంపు, టారిఫ్ ప్రతిపాదనలను శనివారం ఈఆర్సీ(విద్యుత్ నియంత్రణ మండలి)కి ప్రతిపాదలు ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలను సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. ఈ సమావేశానికి ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ఎస్‌‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి , ఎన్‌‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌ రావు హాజరయ్యారు.

    విద్యుత్‌‌ సంస్థలకు ప్రభుత్వం ఏటా ఇచ్చే సబ్సిడీని ఈ సారి రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు తెలిసింది. ప్రజా ప్రయోజనాల కోసమే సాగునీటి ప్రాజెక్టులను వాడుతున్నందున.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వాడే విద్యుత్‌‌ టారిఫ్‌ పెంచకుండా పబ్లిక్‌ యుటిలిటీ కేటగిరీలో చూపించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. మిగతా కేటగిరీలకు చార్జీలు పెంచుకునేందుకు సీఎం అంగీకరించారని అధికార వర్గాల సమాచారం. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసిన విద్యుత్‌‌ పంపిణీ సంస్థలు.. ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించనున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Electricity bill, Electricity tariff, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు