Home /News /telangana /

ELECTRIC TRAINS WILL SOON RUN OVER THE ADILABAD RAILWAY STATION AND TRAIN TRIAL RUN HAS SUCCESSFULLY COMPLETED ADB PRV

Electric trains: ఆదిలాబాద్ పట్టాలెక్కనున్న కరెంటు రైళ్లు .. ట్రయల్ రన్ సక్సెస్..  పరిశీలించిన సేఫ్టీ అధికారి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తర దక్షిణ భారత దేశాలకు మధ్య వారధిగా ఉన్న ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ మీదుగా ఇక మీదట కరెంటు రైళ్లు (Electric trains) పరుగెత్తనున్నాయి.

    (కట్టా లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్)

    ఉత్తర దక్షిణ భారత దేశాలకు మధ్య వారధిగా ఉన్న ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ మీదుగా ఇక మీదట కరెంటు రైళ్లు (Electric trains) పరుగెత్తనున్నాయి. ఇప్పటి వరకు ఈ స్టేషన్ మీదుగా డీజిల్ ఇంజన్ తో రైలు మాత్రమే నడవగా, ఇక మీదట విద్యుత్ తో నడిచే రైళ్ళు (Electric trains) కూడా రానున్నాయి. ఇందుకోసం దక్షణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ లో విద్యుద్దీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాందేడ్ (Nandhed) నుంచి మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే నాగపూర్ ను అనుసందానించడం దీని ముఖ్య ఉద్దేశం.

    దశల వారీగా లైన్ పరిశీలన..

    నాందేడ్ నుంచి నాగపూర్ వరకు 400 కి.మీ దూరం. ఇందులో నాందేడ్ వైపున ముథ్కేడ్ వరకు 24 కి.మీ విద్యుత్ లైన్ (Electric Line) ఇదివరకే ఉంది. అటు నాగపూర్ వైపు మాంజరి వరకు, మాంజరి నుంచి పిప్పలకూటి వరకు విద్యుద్దీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. నాందేడ్ నుంచి పిప్పల్ కూటి వరకు 200 కోట్ల అంచనాలతో మూడు ప్యాకేజీల్లో విద్యుద్దీకరణ చేపట్టారు. దీనిలో పిప్పలకోటి నుంచి ఆదిలాబాద్ (Adilabad) వరకు, ఆదిలాబాద్ నుంచి కోసాయి వరకు పనులు పూర్తికాగా ఇటీవల దశల వారీగా లైన్ పరిశీలన జరుగుతోంది.

    ఇది కూడా చదవండి: మద్యం తాగిన భర్త కిడ్నాప్​.. భర్త ప్రాణాల కోసం మానాన్ని పణంగా పెట్టిన ఇల్లాలు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..

    ఈ నెల 7వ తేదీన తొలి విడతగా పిప్పల్ కోటి నుంచి కోసాయి వరకు ట్రయల్ రన్ (Trial Run) చేపట్టారు. అది విజయవంతం కావడంతో తాజాగా ఈ రోజు ఈ మార్గం లో విద్యుదీకరణ పనులను సౌత్ సెంట్రల్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ముఖ్య అధికారి ఏ.కె.రాయ్ తనిఖీ చేసి విద్యుత్ రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్​ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..? 

    మొదటి విడతలో..

    ప్రత్యేక రైలులో ఇక్కడికి వచ్చిన ఆయన పూర్తైన రైల్వే విద్యుద్దీకరణ పనులను పరిశీలించిన తర్వాత అందించిన నివేదిక మేరకు విద్యుత్ రైలు (Electric Train) ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో నాగపూర్-నాందేడ్ వయా ఆదిలాబాద్ మీదుగా వాణిజ్య, ప్యాసింజర్ రైళ్లు (Passenger Trains) నడిచేందుకు అవకాశం కలిగింది. ప్రస్తుతం పిప్పల్ కూటి నుంచి ఆదిలాబాద్ దాటి కోసాయి వరకు విద్యుద్దీకరణ పనులు దక్షిణ మధ్య రైల్వేలో మొదటి విడతలో తీసుకొని పూర్తి చేశారు.

     తొలిసారిగా..

    మధ్య రైల్వే నుంచి దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ లో తొలిసారిగా విద్యుత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. కోసాయి నుండి నాందేడ్ వరకు రెండవ విడతలో ఈ విద్యుద్దీకరణ పనులను చేపట్టి రానున్న రోజుల్లో పూర్తిచేయనున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ కు పిట్ లైన్ కూడా మంజూరైంది. దీని నిర్మాణం కూడా పూర్తయితే నాందేడ్ జంక్షన్ లో రద్దీ రైళ్లన్నీ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రారంభమై ఇతర ప్రాతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

    ఇవి కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

    ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, ELectricity, Trains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు