ఎలక్షన్ కమిషన్ బృందం టూర్ ముగిసింది... వాట్ నెక్ట్స్.?

తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం రెండు రోజుల టూర్ ముగిసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఈసీ నిర్ణయం తీసుకోనుంది.

news18-telugu
Updated: September 12, 2018, 7:12 PM IST
ఎలక్షన్ కమిషన్ బృందం టూర్ ముగిసింది... వాట్ నెక్ట్స్.?
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన కేంద్ర ఎన్నికల బృందం
  • Share this:
తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు వారి టూర్ సాగింది. మొదటి రోజు వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమైన అధికారులు.. వారి అభ్యంతరాలను నోట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై పలు రాజకీయ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. అయితే, వాటిపై సమగ్రంగా విశ్లేషించి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

రెండో రోజు ప్రధానంగా అధికారులతో ఎలక్షన్ కమిషన్ బృందం సమావేశం నిర్వహించింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమైంది. ఓటర్ల నమోదు కోసం భారీ ఎత్తున ప్రచారం చేపట్టాలని ఆదేశించింది. 15 రోజుల పాటు కార్యక్రమం చేపట్టాలని సూచించింది. అలాగే, జిల్లాలో హెల్ప్ లైన్లు పూర్తి అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా సమస్య గురించి ప్రస్తావిస్తే వాటిని 24 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు.

రెండు రోజుల టూర్ మీద ఎలక్షన్ కమిషన్ బృందం ఢిల్లీకి వెళ్లిన తర్వాత నివేదిక ఇవ్వనుంది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఎన్ని ఈవీఎంలు అవసరం? ఎన్ని వీవీ ప్యాట్‌లు అవసరం ఉంది? వాటిపై అధికారులకు ఇవ్వాల్సిన ట్రైనింగ్, శాంతిభద్రతలు వంటి అంశాలపై సమగ్రమైన నివేదికను ఇవ్వనుంది. ఆ రిపోర్టును పరిశీలించిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్‌పై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.

First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...