Huzurabad: హుజూరాబాద్‌లో దళితబంధుకు బ్రేక్.. ఈసీ కీలక ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

Dalitabandhu: ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ లేఖ రాసింది.

  • Share this:
    హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమలుకు బ్రేక్ పడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ (Election Comission Of India) లేఖ రాసింది. దీంతో ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్‌లో దళితబంధు (Dalita Bandhu) పథకం అమలుకు బ్రేక్ పడనుంది. దళితబంధు పథకంపై ఈసీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు చేసింది. హుజూరాబాద్‌లో మాత్రమే ఈ పథకాన్ని ఆపాలని కోరామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చెందిన పద్మనాభరెడ్డి తెలిపారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు.

    ఎన్నికల సమయంలో పథకాలను అమలు చేయడం రాజ్యాంగవిరుద్ధమని తెలిపారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికే దళితబంధు పథకం అమలు చేస్తున్నారని పద్మనాభరెడ్డి అన్నారు. మొదట్లో పథకం అమలు చేసే క్రమంలో నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేస్తామని అన్నారని.. కానీ హుజూరాబాద్‌లో మాత్రం మొత్తం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారని పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దళితబంధు పథకాన్ని నిలిపివేసే విషయంలో ఈసీ కొంత జాప్యం చేసిందని అభిప్రాయపడ్డారు.

    అంతకుముందు దళితబంధు నేడు సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక్క వర్గానికి మాత్రమే ప్రభుత్వం మేలు చేస్తుందనే విధంగా దళితబంధు విషయంలో ప్రచారం చేయొవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు చేయూత ఇచ్చేందుకు దళితబంధు పథకం మొదలుపెట్టామని.. ఇది ఆషామాషీ పథకం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. గొల్ల, కురుమలకు గొర్రెలు ఇచ్చినప్పుడు దళితులు అడ్డు చెప్పలేదని గుర్తు చేసిన సీఎం కేసీఆర్.. వారి కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఎవరూ అడ్డుపడొద్దని సూచించారు.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    రాబోయే ఏడేళ్లలో తెలంగాణలో ఖర్చు చేయబోయే మొత్తం రూ. 23 లక్షల కోట్లు అని చెప్పిన కేసీఆర్.. అందులో దళితుల కోసం లక్షా 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేమా ? అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు.. దేశంలోని దళితుందరికీ దారి చూపాలని సీఎం కేసీఆర్ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: