హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode Bypoll: సమయం లేదు మిత్రమా.. మరో 10 రోజుల్లోనే మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్?

Munugode Bypoll: సమయం లేదు మిత్రమా.. మరో 10 రోజుల్లోనే మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి హైదరాబాద్‌ (Hyderabad)లో పార్టీ నేతలతో సునీల్‌ బన్సల్‌ సమీక్ష నిర్వహించారు. పది రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని బీజేపీ నేతలతో ఆయన అన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉపఎన్నిక (Munugodu Bypoll) ఎప్పుడెప్పుడా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. మునుగోడు స్థానికులు మాత్రమే  కాదు.. తెలంగాణలోని ఇతర ప్రాంతాలు ప్రజలు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఉపఎన్నికలు అంతలా ఉత్కంఠ రేపుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ .. ఈ మూడు పార్టీలు కూడా మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే.. నేతలతా మునుగోడులో వాలిపోయారు. సభలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారంతో ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్తున్నారు. మరి మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది? ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు..?

  Telangana Govt Jobs: మంత్రి హరీశ్ రావు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన.. వివరాలివే

  మునుగోడు ఉపఎన్నికలు నవంబరులో జరిగే అవకాశముందని పలువురు నేతలు అంచనా వేస్తున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్ (Sunil Bansal) కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి హైదరాబాద్‌ (Hyderabad)లో పార్టీ నేతలతో సునీల్‌ బన్సల్‌ సమీక్ష నిర్వహించారు. పది రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని బీజేపీ నేతలతో ఆయన అన్నారు. 40-45 రోజుల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉందని చెప్పారట. నవంబరు మొదటి లేదా రెండో వారంలో పోలింగ్ ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. నవంబరులో ఉప ఎన్నిక జరగనున్నందున ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని బీజేపీ నేతలకు సునీల్ బన్సల్ సూచించారు. నియోజకవర్గలోని ప్రతీ ఓటరును కనీసం మూడుసార్లు కలిసేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. మొదట పార్టీ స్టీరింగ్‌ కమిటీతో, తర్వాత మండల ఇన్‌చార్జ్‌లతో, అనంతరం నియోజకవర్గ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతలతోనూ సునీల్ బన్సల్ చర్చలు జరిపారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, కులాలపై స్థానిక నేతల నుంచి వివరాలు తీసుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటేనే కాంగ్రెస్‌ అనే ముద్ర నల్లగొండ జిల్లాలో పాతుకుపోయిందని.. ఈ నేపథ్యంలో కమలం కమలం గుర్తును ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని నేతలకు సునీల్ బన్సల్ సూచించారట.

  అటు టీఆర్ఎస్ నేతల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్టోబరు రెండో వారంలో నోటిఫికేషన్‌, నవంబరులో ఉప ఎన్నిక ఉండవచ్చని ఇటీవల టీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు. సమయం తక్కువగా ఉన్నందున.. అందుకు తగ్గట్లుగా ఎన్నికల ప్రచారాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అక్టోబరు 8లోపు మండలాల వారీగా సభలు, ఆర్థిక వ్యయానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకు చెప్పారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. నవంబరులోనే ఉపఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దసరా పండగ తర్వాత.. అన్ని పార్టీలు మునుగోడులో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసే అవకాశముంది. ప్రధాన పార్టీల్లో ఇప్పటికే రెండు పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీచేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. అధికార పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bjp, Munugode Bypoll, Munugodu, Telangana, Trs

  ఉత్తమ కథలు