KT RamaRao: కేటీఆర్ వద్దు.. ఆయనను సీఎం చేయండి : చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

చెరుకు సుధాకర్

దళితుడే సీఎం అని చెప్పి మాటతప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm KCR) ఇప్పుడు కుమారుడిని పీఠంపై కూర్చోబెట్టాలనుకుంటున్నారని చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) అన్నారు. బీసీలకు మేలు కలగాలంటే ఆ మంత్రిని సీఎం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  తెలంగాణలో తదుపరి సీఎంగా కేటీఆర్ (KT RamaRao) రాబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. 'తెలంగాణ ఇంటి పార్టీ' అధ్యక్షుడు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనుక బీసీలకు న్యాయం జరుగుతుందని సోనియాగాంధీ భావించారని.. అయితే, దళితుడిని మొదటి సీఎం చేస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), తానే ఆ పదవిని అనుభవిస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు. ఇప్పుడు తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నదని.. కానీ కేటీఆర్ స్థానంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender) ను సీఎం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.

  మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తే 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటివరకూ అది జరగలేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పుకుంటున్నా, అందులో ఎంతమాత్రమూ స్పష్టతలేదని వ్యాఖ్యానించారు.

  ktr,ktr speech,kcr,ktr interview,trs,eatala rajendar, ktr eatala rajendar,కేటీఆర్, ఈటల రాజేందర్,ktr review on saaho,ktr news,cm kcr,ktr saaho,trs working president ktr,ktr family,trs mla ktr,ktr tweets,ktr twitter,ktr meeting,ktr birthday,ktr vs lokesh,ktr minister,telugu news,mangli ktr song,ktr evaru movie,ktr saaho movie,ktr evaru review,ktr twitter live,ktr saaho review,ktr comments on kcr,ktr on chandrababu,కేటీఆర్,కేటీఆర్ లేటెస్ట్,కేటీఆర్ న్యూస్,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  కేటీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్)


  దళితుడే సీఎం అని చెప్పి మాటతప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కుమారుడిని పీఠంపై కూర్చోబెట్టాలనుకుంటున్నారని చెరుకు సుధాకర్ అన్నారు. బీసీలకు మేలు కలగాలంటే ఈటల సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కోదండరామ్ కు ఎన్డీయే నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. తాను కమ్యూనిస్టు ఉద్యమాల్లో తరచూ పాల్గొంటున్న వాడినని, తాను విజయం సాధిస్తే, విద్యావంతుల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తనను గెలిపించాలని పట్టభద్రులను ఆయన కోరారు.

  ఇదిలాఉండగా.. కొద్దిరోజులుగా తెలంగాణలో ఒకవైపు కేటీఆర్ ను సీఎం చేయాలని ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు పలు వేదికలమీద ఈటల కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల రైతు వేదికల ప్రారంభోత్సవాల సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలోనే గాక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. కేసీఆర్ కు ఉద్యమ సమయం నుంచి వెన్నంటి ఉంటున్న ఈటల.. పలు మార్లు అధిష్టానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.

  తాజాగా మళ్లీ ఆయన కొద్దిరోజుల నుంచి స్వరం పెంచుతున్నారు. బీసీ నాయకుడిగా పేరున్న ఈటల ను సీఎం చేయాలని చెరుకు సుధాకర్ తో పాటు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ నాయకుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం.. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను సీఎం చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
  Published by:Srinivas Munigala
  First published: