నగరంలో ఈజిప్టు ఉల్లిపాయలు...దిగివస్తున్న ధరలు

ఉల్లి ధరలు పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకు వచ్చేవరకు దిగుమతి చేసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ ఉల్లిపాయలను కిలో రూ. 40 చొప్పున సబ్సిడీ కింద అందచేస్తున్నారు.

news18-telugu
Updated: December 25, 2019, 10:44 PM IST
నగరంలో ఈజిప్టు ఉల్లిపాయలు...దిగివస్తున్న ధరలు
ఈ ప్రత్యేక మైన గిఫ్ట్‌ అటు ఇచ్చిన వారిలోనూ, ఇటు తీసుకున్న వారిలో కూడా ఆనందం నింపింది.
  • Share this:
ఉల్లిధరల నుంచి ఉపశమనం లభించింది. ఈజిప్ట్ నుంచి ఉల్లి దిగుమతులు ఎట్టకేలకు హైదరాబాద్ కు చేరాయి. గత కొంత కాలంగా ఊరిస్తోన్న ఉల్లిపాయలను 30 టన్నుల మేర అధికారులు దిగుమతి చేసుకున్నారు. దీంతో ఉల్లి ధరలు అదుపులోకి రానున్నాయి. ఉల్లి ధరలు పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకు వచ్చేవరకు దిగుమతి చేసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ ఉల్లిపాయలను కిలో రూ. 40 చొప్పున సబ్సిడీ కింద అందచేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, అదే విధంగా సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు 40 క్వింటాళ్ళ ఉల్లిని సరఫరా చేయనున్నారు.

కొద్ది రోజుల వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ.100 పలికిన ఉల్లి ధరలు ప్రస్తుతం రూ. కిలో 50-70 మధ్య పలుకుతున్నాయి. ఇదిలా ఉంటే సంక్రాంతి నాటికి ఉల్లి ధరల్లో మార్పులు వస్తాయని భావిస్తున్నారు. కొత్త పంట చేతికి వస్తే ధరలు దిగివస్తాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Published by: Krishna Adithya
First published: December 25, 2019, 10:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading