EETALA RAJENDER WARNS TO MINISTER HARISH RAO KNR VRY
Eetala Rajender : మంత్రి హరీష్ రావు భరతం పడతా.. తెలంగాణకు ఒకరోజు ముందుగానే దీపావళి..
ప్రతీకాత్మక చిత్రం
Eetala Rajender : హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eetala rajender ) సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నుండి తనను వెళ్లగొడితేనే బీజేపీ ( huzurabad ) అక్కున చేర్చుకుందని అన్నారు.. ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ బొమ్మతోనే తాను గెలిచానని చెబుతున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఈ ఫలితాలు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఇక తన ఓటమి కోసం హుజూరాబాద్‌లో కుట్రలు పన్నిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టనని హెచ్చరించారు.
ఎన్నికల విజయం తర్వాత నేడు హుజూరాబాద్‌కు( huzurabad )చేరుకున్న ఈటల రాజేందర్..Etala rajender మరోసారి టీఆర్ఎస్ చేసిన కుట్రలపై మండిపడ్డారు. ఈక్రమంలోనే కుట్రలు చేసిన వారు కుట్రల్లోనే కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. ఇక లాంటీ కష్టం శత్రువుకు కూడా రావద్దని అన్నారు. కాగ ఎన్నికల ప్రచారంలో తాను సీఎం కేసీఆర్ బొమ్మతోపాటు టీఆర్ఎస్ అండతోనే గెలిచానని వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు అవుతాయని అన్నారు. ఇక తాను వందల కోట్లు ఖర్చు పెట్టానని టీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పి కొట్టారు. రెండు గుంటల మనిషి 400 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతారని ఆయన ప్రశ్నించారు.
ఇక ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు . హుజురాబాద్ లో ( huzurabad )ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారన్నారు. కేసీఆర్ అహంకారాన్ని,డబ్బు, మద్యం సీసాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. తనను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని .. అమిత్ షా తనకు అండగా ఉంటానన్నారని చెప్పారు. అమిత్ షా, జేపీ నడ్డాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపును ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు. తన గెలుపుతో టీఆర్ఎస్ సిగ్గుపడాలన్నారు. కేసీఆర్( cm kcr ) అహంకారంపై తెలంగాణ ప్రజలు విజయం సాధించారన్నారు. రాష్ట్రంలో ప్రజలు నిన్ననే దీపావళి పండుగ చేసుకున్నారన్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు సంబరాలు జరుపుకున్నారన్నారు. టీఆర్ఎస్ పిలిచి డబ్బులిచ్చినా ..ఓట్లు తనకే వేశారన్నారు.
10 లక్షలు పది సార్లు ఇచ్చినా.. ప్రజలు ధర్మం వైపే నిలబడతానని చెప్పారన్నారు.ఇక నిష్పక్షపాతంగా ఉండాల్సిన పోలీసులే ఎస్కార్ట్స్‌గా ఉండి అంబులెన్స్ ల్లో డబ్బులు తెచ్చారన్నారు. తన లాంటి కష్టం పగొడికి కూడా రావొద్దని ఈ సంధర్భంగా కోరుకున్నారు... కుట్రదారులు ఎప్పటికైనా కుట్రల్లోనే పోతారన్నారని ఆయన వ్యాఖ్యానించారు.. ఇక తన చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. మోసం చేసింది.. వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్ అని అన్నారు. అదే విషయమై..మావ ,అల్లుళ్లకు సవాల్ చేస్తే రాలేదన్నారు.ఈ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం.
నా చర్మం ఒలిచి, వాళ్ళకి చెప్పులు కుట్టించినా... నేను వారి రుణం తీర్చుకోలేను.కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు.నన్ను ఓడించడానికి ఇక్కడికి వచ్చిన వారి భరతం పట్టుడు ఖాయమని ఆయన చెప్పారు..దీనిపై పార్టీలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.