Eetala rajender : కేసీఆర్ అహంకారాన్ని కూల్చే ఉప ఎన్నిక హుజూరాబాద్..

ఈటల రాజేందర్

Eetala rajender : ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్దులు చేస్తున్న “నిరసనదీక్ష”కు ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు.ఈ సంధర్భంగా విద్యాపై రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన దుయ్యబట్టారు.ఇక యూనివర్శిటిల్లోనే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో పాలకులు ఆలోచించాలని ఆయన కోరారు.

 • Share this:
  ఈ సందర్భంగా ఈటల రాజేందర్(Eetala rajender ) మాట్లాడుతూ.. 2009 కేసీఆర్(kcr) దీక్ష విరమణకు సంబంధించిన న్యూస్‌ను తాను కేయూ 2వ గేటు వద్ద విన్నానని.. అప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగింది. విద్యార్థి లోకం జాక్ గా ఏర్పడి దీక్షలు చేశారని గుర్తుచేశారు.. ఇక, మానవ సంపద నిర్వీర్యం కావడం రాష్ట్రానికి మంచిదికాదన్న ఆయన.. హుజురాబాద్‌లో ఎలా దౌర్జన్యం చేయాలి..? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి అనేదే టీఆర్ఎస్‌ ఆలోచన అని మండిపడ్డారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆశించిన దిశగా సాగడంలేదన్న ఈటల రాజేందర్ విద్యార్థులకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుందో పాలకులు ఒకసారి ఆలోచించాలన్నారు.

  తెలంగాణ రాష్ట్రంలో(telangana) ఎన్నికల కోసమే కొన్ని పథకాలు తీసుకువస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఏ రోజు అంబేద్కర్ జయంతికి(ambedkar) పూల మాల కూడా వేయని సీఎం కేసీఆర్.. కేవలం హుజురాబాద్(huzurabad) ఎన్నికల కోసమే దళిత బంధు(Dalita Bandhu) స్కీం తీసుకొచ్చారని విమర్శించారు. గొల్ల కురుమల కోసం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ కూడా బ్రోకర్ల చేతికి వెళ్లింది.. మేధావులు ఈ లెక్క తేల్చాలన్న ఆయన.. విద్యార్థులు చేసే ఉద్యమాలకు ప్రజల మద్దతు ఉంటుందన్నారు..

  ఇది చదవండి :  భర్త వేధింపులు భరించలేక భార్య ఘోరం... భర్త పడుకున్నప్పుడు ఆయన...!


  ఇక కొద్ది మంది చేతుల్లో ఈ దేశ సంపద బందీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను(contract teacher) నియమించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందన్నారు. హుజురాబాద్ లో ఎలా గెలవాలి అనే ఆలోచన తప్ప విద్యార్థులకు మంచి చేయాలనే ఈ ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే 20వ తేదీ వచ్చినా ముసలి తల్లులకు పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితి మన ధనిక రాష్ట్రంలో వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ (telangana)ఆకలినైన బరిస్తుంది కానీ ఆత్మగౌరవం కోల్పోదని అన్నారు.

  ఇక విద్యార్థులు చేసే న్యాయపరమైన పోరాటాలకు నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.. హుజురాబాద్ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని కూల్చే ఎన్నిక కావాలని ఆయన పిలుపునిచ్చారు. అది తెలంగాణ ఆకాంక్షలను ప్రతిబింబించే ఎన్నికలు కావాలని అన్నారు.

  ఇది చదవండి : సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దళిత కుటుంబాల‌ను వెలి.. కారణం ఇదేనంటున్న వీడిసీలు..


  ఈ రోజు రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు(universities) ఉన్నాయని. కానీ డబ్బు ఉన్నోళ్ళు ఇక్కడ చదువుకోవడానికి రావడం లేదు, డబ్బున్నవాళ్లు డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు వెళ్తున్నారని అన్నారు. విశ్వవిద్యాలయాలు డబ్బున్నవారివి డబ్బులేని వారివి అని విభజించబడ్డాయని చెప్పారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు(private university) అనుమంతి ఇచ్చేటప్పుడు అక్కడ కూడా రిజర్వేషన్ ఉండాలి అని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం వినలేదని చెప్పారు.

  ఈ సంధర్భంగా క్వాలిఫై కాకున్నా డబ్బులు కట్టి చదివిన వాడికి తెలివి కంటే రిజర్వేషన్ తో చదువుకున్నవాడికి తక్కువ ఉంటుందా? ఏం నీతి ? ఏం జాతి? ఇంత వివక్షణా ? అంబేద్కర్ 25 ఏళ్ల తరువాత రిజర్వేషన్లు పోతాయని అనుకున్నారు. డెవెలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రీబూషన్ అని చెప్పారు కానే అది జరగ లేదు. విశ్వవిద్యాలయాల్లో స్టాఫ్ ఎందుకు నియమించడం లేదు, ఈ అరకొర చదువులతో పేద పిల్లలకు ఎక్కడ నైపుణ్యం వస్తుందని ఆయన ప్రశ్నించారు.
  Published by:yveerash yveerash
  First published: