హోమ్ /వార్తలు /తెలంగాణ /

Eetala Rajender : రేపే ఈటెల పాదయాత్ర.. ఎక్కడినుండి.. ఎక్కడివరకు అంటే..

Eetala Rajender : రేపే ఈటెల పాదయాత్ర.. ఎక్కడినుండి.. ఎక్కడివరకు అంటే..

Eetala Rajender : రేపే ఈటెల పాదయాత్ర.. ఎక్కడినుండి.. ఎక్కడివరకు అంటే..

Eetala Rajender : రేపే ఈటెల పాదయాత్ర.. ఎక్కడినుండి.. ఎక్కడివరకు అంటే..

Eetala Rajender : హుజూరాబాద్‌లో పాదయాత్రల పర్వం మొదలైంది..బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన పాదయాత్ర షెడ్యుల్‌ను విడుదల చేశారు. మొత్తం 126 గ్రామాల్లో 22 రోజుల పాటు పాదయాత్ర కొనసాగే విధంగా ప్లాన్ చేశారు. కాగా ఈ పాదయాత్రను శుక్రవారం నుండి ప్రారంభించేందుకు సిద్దమయ్యారు.

ఇంకా చదవండి ...

న్యూస్18 తెలుగు కారస్పాండెంట్. శ్రీనివాస్. పి.

ఇక .పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే ప్రకటించిన ఈటల రాజేందర్ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు..పాదయాత్ర షెడ్యుల్‌ను విడుదల చేశారు..ముఖ్యంగా ..హుజూరాబాద్ , జమ్మికుంట పురపాలికలతోపాటు మొత్తంగా 126 గ్రామాలు, పట్టణాల్లో తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 22 రోజుల్లో తన పాదయాత్రను పూర్తి చేసే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు.

కాగా . ఈ నెల 14 వ తేదీ నుంచి ఈ యాత్ర మొదలు పెట్టాలని ఆయన భావించారు .కాని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాను కలిసేందుకు డిల్లీకి వెళ్లడంతో పాదయాత్ర కార్యక్రమం వాయిదా పడింది . ఈ నెల 16 , తేదిన తన యాత్రను ప్రారంభించే వీలుందని భాజపా శ్రేణులు చెప్పారు.  ఇక  తనకు సెంటిమెంట్ ప్రాంతంగా భావించే కమలాపూర్ మండలం బత్తురోనిపల్లి , గోపాలపురం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు . ప్రతి రోజు సగటున ఆరు గ్రామాలలో పర్యటించడంతోపాటు రోజూ ఆయా గ్రామాల్లోనే రాత్రి బస చేసేలా షెడ్యుల్ విడుదల చేశారు. మొత్తంగా 22 రోజులపాటు సాగే తన పర్యటనను జమ్మికుంటలో నిర్వహించే భారీ బహిరంగ సభతో పాదయాత్ర ను ముగించనున్నారు. ఈటెలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమతో పాటు స్థానిక నాయకులు పాదయాత్రలో పాల్గోనున్నారు.

మరోవైపు పార్టీ అధినేత బండి సంజయ్ పాదయాత్ర సైతం ఈటలకు మద్దతుగా హుజూరాబాద్‌కు చేరుకోనుంది. అయితే ఆయన పాదయాత్ర వచ్చే ఆగస్టు 9న ప్రారంభించినున్నట్టు ప్రకటించారు. మొత్తం తన 56 రోజుల పాదయాత్రలో మొదటి విడతలో భాగంగా హైదరాబాద్‌ నుండి ప్రారంభం కాగా చివరి దశలో పాదయాత్రను కొనసాగించేలా ప్లాన్ చేశారు.

మరోవైపు కేంద్రహోంమంత్రి అమిత్ షా సైతం హుజూరాబాద్ వచ్చేందుకు అంగీకరించారు. బుధవారం బీజేపీ నేతలు ఆయన్ను కలిసిన నేపథ్యంలోనే ఈటలను గెలిపించుకునేందుకు ఎన్నిసార్లైనా హుజూరాబాద్‌కు వస్తానని హామి ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున్న తన శ్రేణులను నియోజకవర్గంలో దింపేందుకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. పాదయాత్ర కొనసాగనున్నన్ని రోజులు అటు జాతీయ, ఇటు రాష్ట్ర స్థాయి నేతలు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం కార్యచరణను సిద్దం చేస్తున్నట్టుగా సమాచారం. ఆ పార్టీ నేతలు కూడా నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభించనున్నట్టు సమాచారం.

First published:

Tags: Eetala rajender, Huzurabad, Karimnagar

ఉత్తమ కథలు