EETALA RAJENDER MEETS KEY BJP LEADERS IN DELHI JUST 2 DAYS BEFORE AMIT SHAH TOUR IN HYDERABAD SK
Eetala Rajender: ఢిల్లీలో ఈటల.. బీజేపీ ముఖ్య నేతలతో కీలక భేటీ.. బండి సంజయ్‌పై ఫిర్యాదుకేనా?
ఈటల రాజేందర్, బండి సంజయ్
Eetala Rajender: హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురువారం ఢిల్లీలో బీజేపీ జాయింట్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) శివ ప్రకాశ్, పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహాారల ఇంచార్జి తరుణ్ చుగ్‌ను వేర్వేరుగా కలిశారు. వీరిద్దరితో సమావేశమై కీలక చర్చలు జరిపారు
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు ప్రజా క్షేత్రంలో బిజీగా ఉన్నాయి. జాతీయ నేతలు కూడా రాష్ట్రంలో వరుసగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో పర్యటించారు. నడ్డా మహబూబ్ నగర్లో పాల్గొంటే.. రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రసంగించారు. రేపు కేంద్రమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి వస్తున్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. తుక్కుగూడలో జరగనున్న బహిరంగ (Tukkuguda BJP Meeting) సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరిస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eetala Rajender) ఢిల్లీకి వెళ్లారు. గురువారం పలువురు బీజేపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురువారం ఢిల్లీలో బీజేపీ జాయింట్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) శివ ప్రకాశ్, పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహాారల ఇంచార్జి తరుణ్ చుగ్‌ను వేర్వేరుగా కలిశారు. వీరిద్దరితో సమావేశమై కీలక చర్చలు జరిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సమయంలో ఈటల ఢిల్లీకి వెల్లి.. ముఖ్య నేతలతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని.. దానిని బీజేపీకి అనుకూలంగా ఎలా మలచుకోవాలన్న అంశంపై వారితో ఈటల చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో తనతో పాటు ఇతర సీనియర్ నేతల సేవలను సక్రమంగా వినియోగించుకోవడం లేదని.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వం అందరినీ కలుపుకొని ముందుకెళ్లని తీరును వారికి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఈటల ఆ ఇద్దరు నేతలతో ఈటల రాజేందర్ ఏయే అంశాలపై చర్చించారన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఐతే ఈ పాదయాత్రకు సంఘీభావంగా ఈటల రాజేందర్ వెళ్లలేదు. పైగా తన నియోజకవర్గంలోనే ఆయన బిజీగా ఉన్నారు. ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. కానీ బండి సంజయ్ యాత్రలో కనిపించడం లేదని.. ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయని.. ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రేపు హైదరాబాద్‌కు వస్తున్నారు. తుక్కుగూడలో జరిగే ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభలో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 2.30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్ షా రానున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను అమిత్ షా సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు వెళ్తారు. సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడ సభాస్థలిలో జరగనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హోంమంత్రి చేరుకుంటారు. అదే రోజు రాత్రి 8.25 గంటలకు అమిత్ షా ఢిల్లీకి బయల్దేరి వెళతారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.