EETALA RAJENDER KNOWS BEFORE THE MURDER CASE OF ADVOCATE VAMAN RAO SAID VAMANRAO FATHER VRY
Murder case : అడ్వకేట్ వామన్‌రావు హత్య కేసులో ఈటల ప్రమేయం ? వామన్ రావు తండ్రి ఆరోపణ
తండ్రి కిషన్ రావు/ వామన్ రావు, నాగమణి దంపతులు (ఫైల్ ఫొటో)
Vaman rao Murder case : అడ్వకేట్ వామన్ రావు హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఆయన హత్యకు ముందే ఈటల రాజేందర్ కు తెలుసని వామన్ రావు తండ్రి కిషన్ రావు అరోపించారు.
అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. వామన్ రావు హత్య కేసులో పుట్ట మధును అరెస్ట్ చేసి విచారిస్తున్న నేపథ్యంలోనే వామన్ రావు తండ్రి సంపత్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వామన్ రావు హత్య జరిగేకంటే ముందే ఈటల రాజేందర్‌కు తెలుసని ఆయన తెలిపారు. అయితే హత్య కేసులో పుట్ట మధు భార్య, మంథని జడ్పి చైర్ పర్సన్ పుట్ట శైలజా ప్రమేయం కూడ ఉందని ఆయన కీలక ఆరోపణలు చేశారు.
దీంతో ఈటల రాజేందర్ రాజకీయ ఎపిసోడ్ కీలక మలుపు తిరుగుతోంది. భూకబ్జా ఆరోపణల తర్వాత ఆయన్ను మంత్రి పదవి నుండి తప్పించిన నేపథ్యంలోనే మరో ఆరోపణను ఎదుర్కోంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అడ్వకేట్ వామన్ రావు హత్య కేసు తాజాగా ఈటల మెడకు చుట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఈటలకు ముఖ్య అనుచరుడిగా ఉన్న పుట్ట మధు అరెస్ట్ జరిగిందనే ప్రచారం జరుగుతోంది.
ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేసిన పుట్ట మధును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు దారితీసిన అంశాలతో పాటు ఆయనపై వచ్చిన పలు అనుమానాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కాగా పుట్టు ఇచ్చే సమధానాలను బట్టి కేసు పురోగతి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈటల రాజేందర్ రాజకీయ వ్యవహరం చిలికి చిలికి గాలివానగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.